న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రికార్డు స్థాయిలో ఆరోసారి బాలన్ డి'ఓర్‌ను గెలిచిన మెస్సీ!!

Argentine footballer Lionel Messi wins record sixth Ballon dOr Title

పారిస్: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ బ్యాలన్‌ డి'ఓర్‌ అవార్డును గెలుచుకున్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డే బ్యాలన్‌ డి ఓర్‌. మెస్సీ రికార్డు స్థాయిలో ఆరోసారి బాలన్ డి'ఆర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక మహిళల కేటగిరిలో అమెరికా సాకర్‌ ప్లేయర్‌ మెగాన్‌ రాపినో బ్యాలన్‌ డీ ఓర్‌ పురస్కారాన్ని అందుకుంది.

సొంతగడ్డపై ఆసీస్‌ను కోహ్లీసేన మాత్రమే ఓడించగలదు.. మరేజట్టుకు సాధ్యం కాదు!!సొంతగడ్డపై ఆసీస్‌ను కోహ్లీసేన మాత్రమే ఓడించగలదు.. మరేజట్టుకు సాధ్యం కాదు!!

మెస్సీ 2015లో చివరగా బ్యాలన్ డి'ఓర్‌ను గెలుచుకున్నాడు. ఇప్పటివరకు మెస్సీ ఆరు గెలుచుకుని.. ప్రత్యర్థి క్రిస్టియానో ​​రొనాల్డోను అధిగమించాడు. రొనాల్డో 5 టైటిల్‌లను ఖాతాలో వేసుకున్నాడు. 2009, 2010, 2011, 2012, 2015, 2019ల్లో బ్యాలన్‌ డి ఓర్‌ పురస్కారాన్ని మెస్సీ దక్కించుకున్నాడు. ఇక రొనాల్డో 2008, 2013, 2014, 2016, 2017ల్లో ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.

'నేను పారిస్లో నా మొదటి బ్యాలన్ డి'ఆర్ గెలిచి 10 సంవత్సరాలు అయ్యింది. నా ముగ్గురు సోదరులతో ఇక్కడకు రావడం నాకు ఇప్పటికి గుర్తుంది. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. ఇన్ని టైటిల్‌లు సాధిస్తా అని అస్సలు ఊహించలేదు' అని మెస్సీ అవార్డు అందుకున్న తరువాత చెప్పారు. 'ఇది ఆరవ టైటిల్. చాలా ఆనందంగా ఉంది. నా భార్య మరియు ముగ్గురు పిల్లలతో నా వ్యక్తిగత జీవితంలో చాలా ప్రత్యేకమైనది' అని మెస్సీ పేర్కొన్నాడు.

బాలన్ డి'ఓర్‌ అవార్డు ప్రధానోత్సవంకు మెస్సీ తన భార్య , ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చాడు. చివరిసారిగా 2017లో బాలన్ డి'ఆర్ గెలిచిన రొనాల్డో.. మూడో స్థానంలో నిలిచాడు. ఈ అవార్డు కోసం రొనాల్డోతో పాటు డచ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ వాన్‌ దిజ్క్‌ పోటీ పడ్డాడు. మొదటి రెండు స్థానాల్లో స్థానం సంపాదించడంలో విఫలం కావడం 2010 తరువాత రొనాల్డోకు ఇదే మొదటిసారి. 2019లో ఇప్పటివరకు 54 మ్యాచ్‌ల్లో 46 గోల్స్ చేసిన మెస్సీ.. గత సీజన్‌లో బార్సిలోనా టైటిల్‌ను గెలుచుకోవడంతో 34 లాలిగా మ్యాచ్‌ల్లో మొత్తం 36 సార్లు గోల్స్ చేశాడు.

మెస్సీ బ్యాలన్‌ డి ఓర్‌ అవార్డుని అందుకోవడంతో ఇంగ్లండ్​ ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ బెక్‌హామ్‌ అభినందనలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో మెస్సీని అభినందించాడు. 'కంగ్రాట్స్‌ మై డియర్‌ ఫ్రెండ్‌' అంటూ మెస్సీకి శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఈ అవార్డుల కార్యక్రమానికి రొనాల్డో గైర్హాజరీ అయ్యాడు. సోషల్‌ మీడియా ద్వారా మెస్సీని అతను అభినందించాడు.

Story first published: Tuesday, December 3, 2019, 12:40 [IST]
Other articles published on Dec 3, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X