బైనోస్ ఎయిరెస్: అర్జెంటీనా ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ కార్లోస్ తెవెజ్ తన చిన్న నాటి స్నేహితురాలు వానెసా మాంసిల్లాను పెండ్లి చేసుకున్నాడు. అర్జెంటీనాలోని సాన్ ఇసిడ్రో నగరంలో వారిద్దరి వివాహం గురువారం ఉదయం జరిగింది.
32 ఏళ్ల తెవెజ్.. విటల్ రికార్డ్స్ కార్యాలయానికి లేత నీటి రంగు షూట్ ధరించి.. 19 ఏళ్లుగా తన స్నేహితురాలిగా ఉన్న వానెస్సాతో కలిసి వచ్చాడు. వారి ముగ్గురు పిల్లలు ఫ్లోరెంసియా (9), కాటై (6), లిటో (2) కూడా పెండ్లికి వచ్చారని ఇఫె అనే వార్తాసంస్థ ఓ వార్తా కథనం ప్రచురించింది. నాలుగు రోజుల పెండ్లి సంబరాల కోసం ఉరుగ్వేలోని కార్మెల్లో నగరానికి 260 మంది అతిథులతో కలిసి వెళ్లారు.
'ఇది ఒక అద్భుతమైన రోజు. నాలుగు రోజుల పాటు పార్టీ చేసుకోవాలని నేను వానా ఎల్లవేళలా కలలు కన్నాం. మా మధ్య గల ప్రేమ ధ్రువీకరణకు ఇది నిదర్శనం. మా ప్రేమ పునరుద్ఘాటన దిశగా మరో అడుగు పడింది' అని మాంచెస్టర్ సిటీ మాజీ ప్లేయర్, జువెంటస్ స్ట్రయికర్ కార్లోస్ వ్యాఖ్యానించాడు.
'ఇది సంబురాలు చేసుకునే సమయం. మిగతా అంశాలన్నీ తర్వాతే నిర్ణయిస్తాం. నన్ను సంబురాలు చేసుకోనివ్వండి' అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం సాయంత్రం పౌర్టో కామాచో చాపెల్‌లో వారిద్దరి వివాహం మత సంప్రదాయాలకు అనుగుణంగా జరిగింది. ఆ తర్వాత కాంపో ఎల్ ఫారో క్లబ్లో బంధు మిత్రులకు విందు ఏర్పాటుచేశాడు.