న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Fifa World Cup 2022: మెస్సీ విజయంతో రోడ్డెక్కిన ప్రజలు.. మరీ ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటారా?

Argentina people celebrate Fifa World Cup victory in style

ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ట్రోఫీ నెగ్గింది. ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు ట్రోఫీ ముద్దాడాడు. ఫైనల్‌లో ఆ జట్టుకు తొలి గోల్ అందించిన మెస్సీ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒక్క ఫైనల్‌లోనే కాదు. క్వార్టర్స్, సెమీస్‌లో కూడా అర్జెంటీనా తరఫున తొలి గోల్ చేసింది మెస్సీనే కావడం గమనార్హం. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్యంగా ఓడిన అర్జెంటీనా.. ఆ తర్వాత ప్రతి మ్యాచులోనూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తూనే వచ్చింది.

ఇలా బెస్ట్ పెర్ఫామెన్సులతో ఫైనల్ చేరిన అర్జెంటీనా ఎట్టకేలకు ట్రోఫీ నెగ్గడం.. తమ అభిమాన తార మెస్సీ కల సాకారం అవడంతో ఆ దేశ ప్రజల ఆనందానికి హద్దులేకుండా పోయింది. వేలాది మంది ప్రజలు తరలి వచ్చి రోడ్డెక్కారు. ఫిఫా వరల్డ్ కప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ రోడ్లపై సంబరాలు చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన డ్రోన్ ఫుటేజి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెస్సీ జన్మస్థలమైన రోసారియోలో కూడా ప్రజలు ఇలాగే సంబరాలు చేసుకున్నట్లు సమాచారం.

ఫైనల్ మ్యాచులో అర్జెంటీనాకు ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపే కొంతసేపు చెమటలు పట్టించాడు. అత్యుత్తమంగా ఆడిన అతను.. ఒంటి చేత్తో తమ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. అర్జెంటీనా ఆరంభంలోనే రెండు గోల్స్ చేసి పైచేయి సాధించగా.. పదినిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ఎంబాపే వెంట వెంటనే రెండు గోల్స్ చేసి స్కోర్లు సమం చేశాడు. ఆ తర్వాత ఎక్స్‌ట్రా టైంలో మరోసారి మెస్సీ తన స్కిల్స్‌తో గోల్ చేయగా ఎంబాపే మరో గోల్ చేశాడు. దీంతో పెనాల్టీ షూటవుట్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ షూటవుట్‌లో కూడా ఎంబాపే, మెస్సీ ఇద్దరూ చెరో గోల్ చేశారు. అయితే ఫ్రాన్స్‌లో మిగిలిన వాళ్లు అందరూ గోల్స్ చేయలేకపోయారు. దీంతో 4-2 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది.

Story first published: Tuesday, December 20, 2022, 9:21 [IST]
Other articles published on Dec 20, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X