సాకర్ ప్రపంచకప్: ఫైనల్‌కు అర్జెంటీనా, జర్మనీతో ఢీ
రియో: సాకర్ ప్రపంచకప్ సందర్భంగా గురువారం తెల్లవారుజామున అర్జెంటీనా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన రెండవ సెమీఫైనల్స్‌లో అర్జెంటీనా ఘనవిజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్ళింది. చివరి వరకు ఉత్కంఠతతో సాగిన మ్యాచ్‌లో అర్జెంటీనా పెనాల్టీ షూట్‌లో 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో అర్జెంటీనా అదివారం జరిగే ఫైనల్‌లో జెర్మనీతో తలపడనుంది.
అర్జెంటీనా, నెదర్లాండ్స్ మధ్య హోరాహోరీగా పోరాడిన ఈ మ్యాచులో నిర్ణీత 90 నిమిషాల సమయంలో గోల్ నమోదు కాలేదు. దీంతో మ్యాచుకు అదనపు సమయం అనివార్యమైంది. అదనపు సమయంలోనూ గోల్ కొట్టకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా గోల్ కీపర్ రోమెరో నెదర్లాండ్స్ ఆటగాడు వ్లార్ కొట్టిన తొలి పెనాల్టీని అడ్డుకోవడంతో ఒక్కసారిగా అర్జెంటీనాకు ఆధిక్యం లభించింది.

అర్జెంటీనా ఆటగాడు మెస్సీ విజయవంతంగా పెనాల్టీని గోల్‌గా మలచగా, నెదర్లాండ్స్ ఆటగాడు రాబెన్ సైతం గోల్ చేసి విజయవంతమయ్యాడు. మరో అర్జెంటీనా ఆటగాడు గరాయ్ కూడా పెనాల్టీని గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా 2-1తో ఆధిక్యంలో సాగింది. ఈ సమయంలో నెదర్లాండ్స్ ఆటగాడు స్నైడర్ పెనాల్టీని అడ్డుకోవడంలో రోమెరో సఫలీకృతుడు కావడంతో అర్జెంటీనా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అర్జెంటీనాకు 3-1 ఆధిక్యం లభించింది. తర్వాత వరుసగా ఆగ్యురో(అర్జెంటీనా), కుయుట్(నెదర్లాండ్స్) గోల్స్ కొట్టడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ సమయంలో రోడ్రెగెయిజ్ కీలక గోల్ కొట్టడంతో 4.2తో అర్జెంటీనా విజయం సాధించింది. దీంతో అర్జెంటీనా జట్టు ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగితేలారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications