Fifa World Cup 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా.. అదరగొట్టిన లియోనెల్ మెస్సీ!

ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ తన కల నెరవేర్చుకునే దిశగా మరో అడుగు వేశాడు. ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో అద్భుతమైన ఆటతీరుతో అర్జెంటీనాను ఫైనల్ చేర్చాడు. క్రొయేషియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి డిఫెన్స్‌ను చాకచక్యంగా విచ్ఛిన్నం చేసిన మెస్సీ.. సూపర్ పెర్ఫామెన్స్ అందించాడు. ఇది చూసిన అభిమానులు ఈసారి కచ్చితంగా కప్పు మెస్సీదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సెమీస్ ఎలా చేరాయంటే..
అంతకుముందు క్వార్టర్ ఫైనల్స్‌లో ఫేవరెట్ బ్రెజిల్‌ను ఓడించి వచ్చిన క్రొయేషియా.. పెనాల్టీ షూటవుట్ ద్వారా ఆ మ్యాచ్ నెగ్గింది. అదే ఊపులో అర్జెంటీనాను కూడా ఓడించి మరో సంచలనం నమోదు చేయాలని భావించింది. అయితే చాలా కాలిక్యులేటెడ్‌గా ఆడిన మెస్సీ.. క్రొయేషియా ఆశలపై నీళ్లు చల్లాడు. అర్జెంటీనాకు కూడా క్వార్టర్ ఫైనల్స్‌లో కొంత ఇబ్బంది ఎదురైంది. అయితే పెనాల్టీ షూటవుట్‌లో నెదర్లాండ్స్‌ను 4-3 తేడాతో ఓడించిన అర్జెంటీనా సెమీస్ చేరుకుంది.

క్రొయేషియా డిఫెన్స్ గేమ్..
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి మిడ్ ఫీల్డ్‌ను క్రొయేషియా చాలా బాగా కంట్రోల్ చేసింది. అద్భుతమైన డిఫెన్స్‌తో అర్జెంటీనాకు గోల్ చేసే అవకాశమే ఇవ్వలేదు. అయితే బాక్స్‌లో అర్జెంటీనా ప్లేయర్ లూకా అల్వారెజ్ కింద పడటంతో ఆ జట్టుకు పెనాల్టీ కిక్ దొరికింది. దాన్ని ఆడేందుకు వచ్చిన లియోనెల్ మెస్సీ సమయస్ఫూర్తితో గోల్ చేశాడు. ఆ తర్వాత మరో ఐదు నిమిషాల్లోనే అల్వారెజ్ మరోసారి క్రొయేషియా డిఫెన్స్‌ను చిత్తు చేస్తూ తన తొలి గోల్ చేశాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి అర్జెంటీనా 2-0తో పైచేయి సాధించింది.
సెకండ్ హాఫ్‌లో మరో గోల్..
సెకండ్ హాఫ్‌లో అయినా అర్జెంటీనాను అడ్డుకొని తాము గోల్స్ చేయాలని క్రొయేషియా ప్రయత్నించింది. అయితే అది వారి వల్ల కాలేదు. తన అద్భుతమైన టెక్నిక్‌తో క్రొయేషియా ఆటగాళ్ల మతులు పోగొట్టిన మెస్సీ.. బంతిని మరోసారి అల్వారెజ్‌కు పంపించాడు. అతను సునాయాసంగా దాన్ని గోల్ చేయడంతో అర్జెంటీనా 3-0తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఆ తర్వాత క్రొయేషియాకు మరో గోల్ చేసే అవకాశమే దక్కలేదు. దీంతో చివరకు 3-0 తేడాతో అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఏడాది మెస్సీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications