
మొత్తం 900 కేజీలపైనే..
ప్రపంచంలో ఎక్కువగా మాంసాహారం తీసుకునే దేశాలు దక్షిణ అమెరికాలోనే ఉన్నాయి. ఇక్కడ ఫుట్‌బాల్ ఎంత పాపులరో, నాన్‌వెజ్ డిష్‌లు కూడా అంత ఫేమస్. అలాగే ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం కూడా మాంసాహారం తప్పదు. అందుకే ఈ రెండు జట్లు తమ స్వదేశం నుంచి ఏకంగా 900 కేజీలపైగా మాంసాన్ని తమ వెంట తెచ్చుకున్నాయట. అంటే కతార్‌లో మాంసం దొరకదని కాదు. వాళ్ల దేశాల్లో అయితే నెంబర్ వన్ మాంసం దొరుకుతుందని, అలాగే ఆటగాళ్లకు కూడా ఇంటి దగ్గరి ఆహారం తిన్నట్లు ఉంటుందనేది వాళ్ల ఆలోచన.

నెంబర్ వన్ మీట్..
ఇలా మాంసాన్ని పంపడం గురించి ఉరుగ్వేయన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (యూఎఫ్ఏ) ప్రెసిడెంట్ ఇగ్నాసియో అలెన్సో స్పందించారు. 'మా జట్టు ఆటగాళ్లు అద్భుతమైన సహచరుడితో కలిసి కతార్ వెళ్తున్నారు. అదే ప్రపంచ నెంబర్ వన్ ఉరుగ్వే మాంసం' అని చెప్పారు. ఎలాగైనా తమ జట్టు ఈసారి కప్పు గెలవాలని కోరుకుంటూ ఉరుగ్వేలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీట్' సంస్థ కూడా ఆశిస్తోంది. ఆటగాళ్లకు తమ కంపెనీ మాంసం క్వాలిటీ, విలువను చెప్పడానికి ప్రపంచకప్ కన్నా మంచి వేదిక ఏముంటుంది? అని ఆ కంపెనీ ప్రెసిడెంట్ అంటున్నారు. ఉరుగ్వే జట్టు నవంబరు 24న తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో తలపడుతుంది.

అర్జెంటీనా కూడా..
ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జెంటీనా జట్టు కూడా మాంసాన్ని తమ దేశం నుంచి తెచ్చుకుంది. అర్జెంటీనాలో ఫుట్‌బాల్‌తో సమానంగా పాపులర్ అయిన డిష్ 'అసాడో'. చిన్న చిన్న మాంసం ముక్కలతో చేసే ఈ డిష్ అంటే తనకు చాలా ఇష్టమని, ఇది కేవలం డిష్ కాదు తమ సంస్కృతి అని అర్జెంటీనా టీం హెడ్ కోచ్ లియోనెల్ స్కాలోనీ అన్నాడు. అందుకే అర్జెంటీనా టీం కూడా స్వదేశం నుంచి మాంసం తెచ్చుకుందట. అర్జెంటీనా జట్టు తొలి మ్యాచ్‌లో నవంబరు 22న సౌదీ అరేబియాను ఎదుర్కుంటుంది.


Click it and Unblock the Notifications


