సిడ్నీ: వరల్డ్‌కప్‌లో విజయాలపై ఆక్టోపస్, చిలుక జోస్యాలతో బాటు తాజాగా మొసలి జోస్యంకూడా చేరింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని డార్విన్ మొసళ్లసంరక్షణకేంద్రంలో హారీ అనే మొసలి ముందు స్పెయిన్, నెదర్లాండ్స్ జెండాలు ఉన్న కోడిమాంసాన్ని వుంచగా స్పెయిన్ పతాకం ఉన్న మాంసాన్ని హారీ ఎంచుకుంది.
దీంతో స్పెయిన్‌దే విజయమని జూక్యూరేటర్ వ్యాఖ్యానించారు. జర్మనీలోని ఆక్టోపస్ కూడా స్పెయిన్‌దే విజయమని జోస్యం చెప్పగా సింగపూర్‌కు చెందిన మణి అనే చిలుక నెదర్లాండ్స్‌దే విజయమని వూహించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఫైనల్ సంగ్రామం ఈ జోస్యాలతో మరింత ఉత్కంఠకు తెరతీసింది.