రొనాల్డోకోసం.. మోడల్ ఆండ్రెస్సా హల్‌చల్, నాడు రాత్రి..
రియో డి జనీరో: పోర్చుగల్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న మైదానంలోకి బ్రెజిల్ మోడల్ ఆండ్రెస్సా ఉరాచ్ అనుమతి లేకుండా ప్రవేశించి కాసేపు కలకలం సృష్టించింది. ఆమె విలేకరి అవతారంలో పోర్చుగల్ మైదానంలోకి వచ్చింది. దీనిని గుర్తించిన భద్రతా సిబ్బంది ఆమెను వెంటనే వెనక్కి పంపించారు.
ఆమె వచ్చింది తన ఆట తీరుతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిష్టియానో రొనాల్డో కోసం. రోనాల్డోకు తనకు శారీరక సంబంధం ఉందని గతేడాది చెప్పి ఆమె సంచలనం సృష్టించింది. క్రిస్టియానో రొనాల్డోతో తాను ఓ రాత్రి కలిసున్నానని ఆమె అప్పట్లో చెప్పింది.

2014 ఫిఫా సాకర్ ప్రపంచకప్ సందర్భంగా శరీరానికి రంగు (బాడీ పెయింట్) పులుముకుని పోర్చుగల్ జట్టుకు స్వాగతం పలికి మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ కప్ కోసం క్రిస్టియానో రొనాల్డో తమ దేశానికి రావడంతో ఒంటిపై రొనాల్డో జెర్సీ పెయింటింగ్ వేసుకుంది. ఇప్పుడు రోనాల్డో ప్రాక్టీస్ చేస్తుండగా సెక్యూరిటీని ఛేదించుకుని మైదానంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications