ఆండ్రీ గాయం జట్టుకే నష్టం తెచ్చిపెట్టిందా..?

హైదరాబాద్: ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో జ్యువెంటస్ జట్టు రియల్ మాడ్రిడ్ జట్టుతో తలపడి 0-3 తేడాతో ఓడిపోయింది. ఈ గేమ్‌లో రొనాల్డో సైకిలింగ్ కిక్ అందరినీ ఆకట్టుకుంది. అయితే జ్యూవెంటస్ జట్టు మాత్రం ఆండ్రీ బర్జాగ్లీ కడుపునొప్పితో మ్యాచ్‌కు దూరమవడమే ఈ ఓటమికి కారణమని చెప్పుకొస్తుంది.
90నిమిషాల నిడివితో జరిగిన క్వార్టర్ ఫైనల్ గేమ్‌లో ఆండ్రీ పాల్గొన్నాడు. ఏప్రిల్ 4వ తేదీన ఆ మ్యాచ్ జరుగుతుండగానే అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అందుబాటులో ఉన్న వైద్యుని సలహా తీసుకున్నారు. అతను ఎమ్మారై స్కానింగ్ నిర్వహించి సర్జరీ చేయాలని చెప్పడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది. మరి కొద్ది రోజుల్లో తిరిగి ఆడగలడు అని ఆండ్రీ సన్నిహితులు చెప్తున్నారు.
అయితే తర్వాతి మ్యాచ్ రియల్ మాడ్రిడ్ జట్టుతో 0-3 తేడాతో ఓడిపోయి దాని ఫలితాన్నంతా ఆండ్రీపైనే వేసేస్తుంది జ్యూవెంటస్ జట్టు. ఇతని స్థానంలోకి జట్టులో యూరోపియన్ ఛాంపియన్స్ మస్సిమిలియానో అల్లెగ్రీ ఏప్రిల్ 7వ తేదీ భర్తీ చేయనున్నారు.
ఆ తర్వాత స్పెయిన్‌కు వెళ్లి రియల్ మాడ్రిడ్ జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో పాల్గొననున్నాడు. ఏప్రిల్ 11వ తేదీ జరగనున్న మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది జ్యూవెంటస్ జట్టు. ఒకవేళ జట్టులో ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఉన్నట్లైతే పాత జట్టే రియల్ మాడ్రిడ్‌తో తలపడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications