For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పక్కటెముకలు విరిగినా: ప్రమాదం నుంచి కోలుకుని మళ్లీ ఫామ్‌లోకి అగురో

Amsterdam crash still taking toll on Manchester City star Aguero

హైదరాబాద్: క్రీడాకారులు ఫామ్ కోల్పోతే మళ్లీ తెచ్చుకోవడం కష్టం. అలాంటిది మాంచెస్టర్ సిటీ స్టార్ సెర్జియో అగురో సెప్టెంబరు నెలలో రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. ఈ ప్రమాదంలో తన పక్కటెముకలకు గాయమైనా సరే మూడు వారాల అనంతరం మళ్లీ మ్యాచ్ లో ఆడి తన ఫాం ను ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు.

సెప్టెంబరు నెలలో జరిగిన వాట్ ఫర్డ్-మాంచెస్టర్ సిటీ మ్యాచ్‌లో ఆడిన అగురో 6-0 తేడాతో హ్యాట్రిక్ గోల్స్ చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. మ్యాచ్ ఆడి ఎయిర్ పోర్టుకు వెళతుండగా తను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై తన పక్కటెముకలకు గాయమైంది.

మూడు వారాల విరామం అనంతరం నవంబరులో నాపోలి ప్రదేశంలో జరిగిన ఛాంపియన్ లీగ్ లో ఆడి 4-2 స్కోరుతో మళ్లీ తన సత్తా చాటాడు. అదే దూకుడుతో డిసెంబరు 3న మళ్లీ వెస్ట్ హామ్ యునైటెడ్ ఎఫ్‌సీతో తలపడి 2-1 స్కోరును గెలుచుకున్నాడు.

స్ఫానిష్ ఫుట్‌బాల్ కోచ్ గార్డియోలా మీడియాతో మాట్లాడుతూ 'వాట్‌ఫర్డ్ తో జరిగిన మ్యాచ్లో అతని ప్రదర్శన చూశాను. ఇప్పుడు వెస్ట్ హామ్ టీంతో గెలిచిన తీరు, టీంలో అగురో కనబరచిన ప్రతిభ అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉంది' అని ప్రశంసల వర్షం కురిపించాడు'

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు స్ట్రైకర్స్, ఇద్దరు వింగర్స్‌ను ఎదుర్కోవడం చక్కని అనుభవం నేర్పిందని అన్నాడు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు సులువుగా ఎదుర్కోగలనని నమ్మకాన్ని వెలిబుచ్చాడు.

Story first published: Monday, December 4, 2017, 17:25 [IST]
Other articles published on Dec 4, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+