Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సత్తా చాటుకున్న అమెరికా, ఇంగ్లాండ్ నాకౌట్ కు

Jozy Altidore
జోహానెస్ బర్గ్: అమెరికా, ఇంగ్లాండ్ ఆఖరి మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్‌ 'సి' నుంచి ముందుకెళ్లాయి. అల్జీరియాపై నెగ్గిన అమెరికా, స్లొవేనియాను ఓడించిన ఇంగ్లాండ్‌ ఐదేసి పాయింట్లతో సమంగా నిలిచాయి. కానీ మెరుగైన గోల్స్‌ తేడాతో అమెరికా గ్రూప్ ‌లో అగ్రస్థానం సంపాదించింది. ఒక్కో గెలుపు, డ్రా, ఓటములతో స్లొవేనియా (4 పాయింట్లు) మూడో స్థానంతో సరిపెట్టుకుంది. రెండు ఓటములు, ఒక డ్రాతో అల్జీరియా (1) అట్టడుగున నిలిచింది. పాపం..స్లొవేనియా. ఇంగ్లాండ్ ‌తో మ్యాచ్ ‌ను డ్రా చేసుకున్నా నాకౌట్‌ చేరుకునేది. ఓడినప్పటికీ..అమెరికా-అల్జీరియా మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే ముందుకెళ్లేది.

ఎట్టకేలకు ఇంగ్లాండ్‌ నెగ్గింది. రెండో రౌండ్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది. బుధవారం జరిగిన గ్రూప్‌-సి మ్యాచ్‌లో స్లొవేనియాను 1-0తో ఓడించి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. వరుసగా రెండు డ్రాలతో సరిపెట్టుకున్న ఇంగ్లాండ్‌ కు టోర్నీలో ఇదే తొలి గెలుపు. జెర్మైన్‌ డెఫో (23వ నిమిషం) జట్టుకు గెలుపు గోల్‌ అందించాడు. ఈ మ్యాచ్‌ ముందువరకు గ్రూప్‌ లో అగ్రస్థానంలో ఉన్న స్లొవేనియా అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒక్కో గెలుపు, డ్రా, ఓటమితో మొత్తం నాలుగు పాయింట్లతో ఉన్న స్లొవేనియా.. అమెరికా, ఇంగ్లాండ్‌ తర్వాత మూడో స్థానంలో నిలిచింది.

ఓవైపు కోచ్‌ పై టెర్రీ వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం..మరోవైపు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌..మొత్తానికి స్లొవేనియాతో మ్యాచ్‌ ఆరంభంలో ఇంగ్లాండ్‌ ఒత్తిడిలో కనిపించింది. ఆటగాళ్లు బంతిపై నియంత్రణ సాధించడంలో తడబడ్డారు. స్లొవేనియా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చూసింది. ఏడో నిమిషంలో ఆ జట్టుకు మంచి అవకాశం కూడా లభించింది. ఐతే ఇంగ్లాండ్‌ రక్షణశ్రేణిని ఛేదించుకుంటూ వచ్చిన బిర్సా బంతిని నేరుగా గోల్ ‌కీపర్‌ జేమ్స్‌ చేతుల్లోకి కొట్టాడు. వెంటనే పుంజుకున్న ఇంగ్లాండ్‌..స్లొవేనియా దాడులకు చెక్‌ పెట్టింది. వరుసగా గోల్‌ అవకాశాలను సృష్టించుకుంటూ ప్రత్యర్థి గోల్ ‌కీపర్ ‌ను ఒత్తిడిలో పడేసింది. రూనీ, లాంపర్డ్‌, జెరార్డ్‌ కలిసికట్టుగా గోల్‌ ప్రయత్నాలు చేశారు. 14వ నిమిషంలో 30 గజాల నుంచి లాంపర్డ్‌ కొట్టిన ఫ్రీకిక్‌ ను స్లొవేనియా గోల్‌కీపర్‌ హండనోవిచ్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. వెంటనే రూనీ కూడా గోల్‌ చేసేందుకు విఫలయత్నం చేశాడు. పటిష్ఠమైన స్లొవేనియా డిఫెన్స్‌ను దాటి ఇంగ్లాండ్‌ గోల్‌ చేయడం కష్టమే అనిపించింది. కానీ.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు తెలివిగా పాస్ ‌లు అందించుకుంటూ స్లొవేనియా డిఫెన్స్ ‌ను బోల్తాకొట్టించారు. సహచరుడి నుంచి కుడివైపు కార్నర్‌ లో పాస్‌ అందుకున్న మిల్నర్‌ అద్భుత రీతిలో గోల్ ‌పోస్ట్‌ కు సమీపంలో ఉన్న డెఫోకు పాస్‌ అందించాడు. ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా అతడు బంతిని నెట్లోకి నెట్టాడు. ఇంగ్లాండ్‌ ను ఆధిక్యంలో నిలిపాడు. ఐదు నిమిషాల్లోనే ఇదే రీతిలో మిల్నర్‌, డెఫో గోల్‌ చేసేందుకు చూశారు. కానీ సఫలం కాలేదు.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+