For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Fifa World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు అంతా సిద్ధం.. అందరి కళ్లూ వీరి పైనే..!

All eyes on these five players duting Fifa World Cup final

ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచేందుకు రెండు అత్యుత్తమ జట్టు పోటీ పడుతున్నాయి. అద్భుతంగా పోరాడుతూ ఫైనల్ చేరిన అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు ట్రోఫీ కోసం తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో రెండు జట్ల అభిమానులు తమ స్టార్ ఆటగాళ్లు రాణించాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లూ ఐదుగురు ఆటగాళ్లపై ఫోకస్ చేయనున్నాయి. వాళ్లెవరంటే..

లియోనెల్ మెస్సీ

లియోనెల్ మెస్సీ

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీకి ఇదే చివరి వరల్డ్ కప్ కావొచ్చు. ఇప్పటికే 35 ఏళ్ల వయసున్న మెస్సీ.. మరో వరల్డ్ కప్ ఆడే అవకాశాలు దాదాపుగా లేవు. దానికితోడు ఈ టోర్నీలో ఎలాగైనా జట్టును గెలిపించాలన్న కసితో మెస్సీ ఆడుతున్నాడు. ఒకదాని తర్వాత మరొక మ్యాచులో అద్భుతమైన ప్రదర్శనలతో జట్టును గెలిపిస్తున్నాడు. ఈ టోర్నీ టాప్ స్కోరర్లలో ఒకడైన అతను.. ఈసారైనా ట్రోఫీ ముద్దాడుతాడా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అర్జెంటీనా విజయావకాశాలు మెస్సీపైనే ఆధారపడి ఉన్నాయనడం అతిశయోక్తి కాదు.

ఆంటోనీ గ్రిజ్‌మాన్

ఆంటోనీ గ్రిజ్‌మాన్

ఈ టోర్నీలో ఫ్రాన్స్ తరఫున అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో గ్రిజ్‌మాన్ ఒకడు. ఎటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌గా ఆడే అతను ఫ్రాన్స్ టాప్ ప్లేయర్ ఆలివియర్ గిరోడ్ వెనుకనే ఉంటాడు. తన క్రియేటివిటీతో జట్టుకు ఎన్నో అవకాశాలు సృష్టించిన గ్రిజ్‌మాన్.. ఖతర్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో మూడు కీలక అసిస్ట్‌లు అందించాడు. ట్యునీషియా చేతిలో జట్టు ఓడిన మ్యాచులో మాత్రమే గ్రిజ్‌మాన్ ఆడలేదు. అర్జెంటీనా నిజంగా ట్రోఫీ నెగ్గాలని అనుకుంటే కచ్చితంగా గ్రిజ్‌మాన్‌ను కట్టడి చేయాల్సిందే.

కిలియన్ ఎంబాపే

కిలియన్ ఎంబాపే

ఫ్రాన్స్ జట్టులో ప్రధానమైన ఎటాకింగ్ ప్లేయర్ కిలియన్ ఎంబాపే. అద్భుతమైన వేగంతో ప్రత్యర్థి శిబిరంలోకి దూసుకుపోయి గోల్స్ చేయడం ఎంబాపే స్పెషాల్టీ. ఖతర్‌లో అత్యుత్తమంగా ఆడుతున్న అతను.. ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు గోల్స్ చేయడంతోపాటు రెండు అసిస్ట్‌లు కూడా నమోదు చేశాడు. ఈ టోర్నీలో ఏకంగా 21 డ్రిబిల్స్ పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఫ్రాన్స్.. ఈసారి కూడా ఫిఫా వరల్డ్ కప్ ముద్దాడాలంటే ఎంబాపే రాణించాల్సిన అవసరం చాలా ఉంది.

జూలియన్ అల్వారెజ్

జూలియన్ అల్వారెజ్

అర్జెంటీనా జట్టులో మొదటి ఛాయిస్ స్ట్రైకర్‌గా ఉన్న లాటారో మార్టినెజ్ పేలవ ఫామ్ కారణంగా జూలియన్ అల్వారెజ్‌కు అవకాశం దక్కింది. తనకు ఛాన్స్ దొరికిన తొలి మ్యాచ్‌లోనే గోల్ చేసిన అల్వారెజ్.. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఆస్ట్రేలియాపై కూడా గోల్ చేశాడు. సెమీఫైనల్‌లో క్రొయేషియాపై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఖతర్‌లో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన అతను నాలుగు గోల్స్ సాధించాడు. ఈ ఏడాది గోల్డెన్ బూట్ అవార్డు రేసులో ఉన్నాడు.

ఎంజో ఫెర్నాండెజ్

ఎంజో ఫెర్నాండెజ్

తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్యంగా ఓడిన అర్జెంటీనా.. తమ జట్టులో ఏదో మార్పు చేయాలని అర్థం చేసుకుంది. ఈ క్రమంలోనే మిడ్ ఫీల్డ్‌లో ఎంజో ఫెర్నాండెజ్‌కు చోటు దక్కింది. మెక్సికోతో మ్యాచ్‌లో తొలిసారి బరిలో దిగిన ఫెర్నాండెజ్ అద్భుతమైన గోల్ చేశాడు. ఆ తర్వాత పోలండ్‌తో మ్యాచ్‌లో కూడా మిడ్‌ఫీల్డ్‌లో సూపర్ పెర్ఫామెన్స్ అందించాడు. అర్జెంటీనా ఆడిన మిగతా మ్యాచుల్లో కూడా కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్‌లో క్రొయేషియాపై కూడా అత్యుత్తమంగా ఆడాడు. ఫ్రాన్స్ కనుక తమ టైటిల్ నిలుపుకోవాలని అనుకుంటే ఫెర్నాండెజ్‌‌ను నిలువరించక తప్పదు.

Story first published: Sunday, December 18, 2022, 18:09 [IST]
Other articles published on Dec 18, 2022
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+