For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందరి కళ్లూ హబాస్‌పైనే: నేడే కోల్‌కతాతో ఢీ

పుణె: పుణె సిటీ ఎఫ్ సి, అట్లెటికో డీ కోల్ కతా మధ్య ఆదివారం శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ పుణె హెడ్ కోచ్ అంటోనియో హబాస్‌పైనే కేంద్రీకరించాయి. ఏడు మ్యాచ్‌ల్లోనూ కేవలం ఆరు పాయింట్లతో దిగువన ఉన్న పుణె కోచ్ హబాస్.. తమ ప్రత్యర్థి అట్లెటికో డీ కోల్‌కతాను ఢీ కొట్టేందుకు టీంను సిద్ధం చేస్తున్నానన్నాడు. గతంలో అట్లెటికో డీ కోల్‌కతా కోచ్‌గా వ్యవహరించాడు.

'నేను ప్రస్తుతం పుణెకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నేను నా టీంను ప్రత్యర్థి జట్టు ఎటికెపై ఆడేందుకు సిద్ధంచేస్తున్నా. ఇది చాలా సాధారణ విషయం. నేను ఎటికెలో కొందరు ప్లేయర్లకు తెలుసు. నాకు కొందరు ఆటగాళ్లు తెలుసు. కానీ వారు వేరే టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేను వేరే టీం కోచ్ గా ఉన్నా. ప్రస్తుతం వ్యవస్థ భిన్నంగా ఉంది. నేను కేవలం పుణెపైనే ఫోకస్ పెట్టా. వారు కూడా వారి టీం గురించి అంతే ఆలోచిస్తారు' అని మీడియాకు తెలిపాడు.

కోల్‌కతాను ఐఎస్ఎల్ ప్రారంభ టోర్నీ టైటిల్, గత ఏడాది సెమీ ఫైనల్స్ వరకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ పుణెను ఆ స్థాయిలో ప్రభావితం చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. 'మేం మంచిగా ఆడటం లేదని మాకు తెలుసు. ఇది గత రెండేళ్ల నాటి పరిస్థితికి భిన్నం. కొందరు వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు, కొన్ని పొరపాట్లు చేశాం. దాని ఫలితంగానే మూడు, నాలుగు పాయింట్లు వెనుకబడి ఉన్నాం' అని హబాస్ అన్నాడు.

All eyes on Habas as Pune face ATK

'నా శిక్షణ పద్ధతికి అనుగుణంగా టీంను తీర్చిదిద్దేందుకు మాకు కొంత సమయం కావాలి. ఇది చాలా దీర్ఘ కాలిక ప్రక్రియ. అందువల్లే మేం చాలా పాయింట్లు పొందలేకపోయాం. కానీ మేం దానిపైనే ప్రస్తుతం కేంద్రీకరించాం. పాయింట్ల పట్టికలో దిగువ నుంచి పైకెగసి పడటం సమస్యే కాదు. మాకు పోరాడే శక్తి ఉంది. రేపటి వరకు వేచి చూడండి. అయినా ఇది షార్ట్ ఫార్మాట్ టోర్నీ. సరిదిద్దుకోవడానికి సరిపడా సమయం ఉండదు. చాలా కష్టపడాల్సి వస్తున్నది. కొన్నిసార్లు బాగా ఆడినా, ముందుకెళ్లలేకపోతున్నాం' అని చెప్పాడు.

'ఈ టోర్నీలో నాలుగు టీంలు మాత్రమే సెమీస్‌కు వెళతాయి. పుణె ఇంతవరకు సెమీస్ లో ఆడనే లేదు. సెమీస్‌లో ఆడాలన్నది మా లక్ష్యం. తొలి సంవత్సరం మా టార్గెట్ కోల్‌కతాపై క్వాలిఫై అయి సెమీస్ కు వెళ్లాలి. ఆ దిశగా మేం ముందుకెళతాం. వచ్చే ఏడాది కూడా మాకు లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. ఈ ఏడాది ఎలాగైనా జట్టును సెమీస్ బాట పట్టించాలన్నదే మా లక్ష్యం. అందుకోసం చేయాల్సిందంతా చేస్తాను' అని హబాస్ వివరించాడు.

ఇప్పటికీ పుణెకు సెమీస్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా? అన్న విషయం తాను చెప్పలేదనని, ప్రస్తుతం పాయింట్ల టేబుల్ లో దిగువన ఉన్నాం. రేపు ఏం చేస్తామన్నది తర్వాత చెప్తాను. నార్త్ఈస్ట్ కు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్ లో గెలుపొందామని తెలిపాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే కోల్ కతా సారధిగా హెల్డర్ పొస్టిగ ఎంపికలో హబాస్ పాత్ర కీలకం. కానీ గతేడాది ప్రారంభ మ్యాచ్ మాత్రమే ఆడి రెండు గోల్స్ చేసిన తర్వాత గాయంతో పూర్తిగా టోర్నీ నుంచే వైదొలిగాడు. ఈ దఫా హబాస్ ను పొస్టిగ ఎదుర్కొంటాడా? అన్న సంగతి తేలాల్సి ఉన్నది.

'మాకు చాలా విశ్రాంతి లభించింది. కనుక శిక్షణ పొందేందుకు, మ్యాచ్‌లో మంచిగా ఆడేందుకు సమయం చిక్కింది. ఈ లీగ్ చాలా కాంపిటీటివ్ గా ఉంది. పుణె జట్టు చాలా మంచి టీం. ఆంటోనియో హబాస్ ఎలాంటి వ్యూహకర్తో నాకు తెలుసు. కానీ ఈ మ్యాచ్ మాకు చాలా టఫ్‌గా ఉంటుంది' అని అట్లెటికో డీ కోల్ కతా సారధి హెల్డర్ పొస్టిగ వ్యాఖ్యానించాడు. అట్లెటికో డీ కోల్ కతాలో చాలా మంది అంతర్జాతీయ ప్లేయర్లు ఉన్నారు. వారి శక్తి సామర్థ్యాలన్నీ హబాస్‌కు కొట్టిన పిండే.

ఫిఫా టాప్ టెన్ నుంచి మెస్సీ ఔట్

స్పానిష్ ఫుట్ బాల్ లీగ్ 'లా లీగ' టోర్నీలో జెయింట్స్ టీం బార్సిలోనా ఎఫ్ సి క్లబ్ ప్లేయర్ లియానెల్ మెస్సీ.. 2016 టాప్ 10 ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాడు. కాకపోతే టాప్ 50 జాబితాలో మాత్రం ప్లేస్ లభించింది. గత 12 నెలల్లో అంతర్జాతీయ ప్లేయర్ల శక్తి సామర్థ్యాలను బట్టి టాప్ క్రీడాకారులను సోమవారం నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియ తర్వాత వచ్చే శుక్రవారం ఎంపికచేసే అవకాశాలు ఉన్నాయి. 2008 నుంచి గతేడాది టాప్ పెర్పార్మర్ అవార్డును అందుకుని బెస్ట్ ప్లేయర్లలో ఒకడిగా నిలిచిన మెస్సీ.. తమ జట్టుకే థ్రిల్లింగ్ విజయాలు చేకూర్చాడు. టాప్ వన్ జాబితాలో రియల్ మాడ్రిడ్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో చోటు దక్కించుకోగా, మెస్సీకి 11వ స్థానం లభించింది. మూడో స్థానంలో గారెథ్ బాలె, లూయిస్ సౌరెజ్, నెయ్మార్, రాబర్ట్ లెవాండోవిస్కీ, రియాడ్ మాహ్రెజ్, అంటోనియో గ్రైజ్మనన్, రిచర్డో ఖ్వారెస్మా తదితరులు టాప్ టెన్ లో చోటు దక్కించుకున్న బెస్ట్ ప్లేయర్లు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+