న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

'ఆ 111 వచ్చాయ్.. రిటైర్ అయిపోయా'

Akinfeev announces Russia retirement after earning 111 caps

న్యూఢిల్లీ: సీఎస్‌కేఏ మాస్కో గోల్‌కీపర్, సాకర్ వరల్డ్ కప్‌ను రష్యా సాధించినప్పుడు, ఆ జట్టుకు సారధ్యం వహించిన ఎల్‌గోర్ అకిన్‌ఫీవ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తమ దేశానికి 111సార్లు ప్రాతినిధ్యం వహించిన ఈ 32 ఏళ్ల వరల్డ్ స్టార్ గోల్‌కీపర్ 15 ఏళ్లపాటు దేశం తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. ఇక తను రాజీనామా ప్రకటించాల్సిన సమయం వచ్చిందని తప్పుకున్నాడు.

రిటైర్‌మెంట్ తర్వాత యువ ఆటగాళ్లను మరింత ప్రోత్సహించేందుకు, ఇకముందు క్లబ్ విధుల్లో పూర్తిగా పాలుపంచుకునేందుకే అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రతి కథకూ ఒక ముగింపు ఉంటుందని, తన కెరీర్ కూడా జాతీయ జట్టుతో ముడిపడి లాజికల్‌గా ముగిసిందని అన్నాడు. రష్యా జట్టుకు కెప్టెన్‌గా తనను ఎంపిక చేయడం గొప్ప విషయమైతే, ఈ జట్టు 2014లో బ్రెజిల్‌తో జరిగిన ఫైనల్‌లో వరల్డ్ కప్ సాధించేందుకు తన వంతు పాత్ర పోషించడం ఎంతో గర్వంగా ఫీలవుతున్నానని అన్నాడు.

వరల్డ్ కప్‌లో పాల్గొనే రష్యా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గర్వంగా భావిస్తున్నానని అన్నాడు. ఇలాంటి అవకాశం వస్తుందని తాను కలలోనైనా అనుకోలేదని అన్నాడు. ఇది నా అంతర్జాతీయ కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే జరగడం తన అదృష్టమని తెలిపాడు. జాతీయ జట్టుకు కెప్టెన్ అవడమనే కల నిజమైనందుకు ఎంతో గర్వంగా ఉందని, ఫుట్‌బాల్ క్రీడా జీవితంలో బాగా ఉన్నత స్థితిలో ఉన్నపుడే కెరీర్‌కు ముగింపు పలికేందుకు అవకాశం రావడం గొప్ప విషమని పేర్కొన్నాడు.

ఇక ముందు తమ ఫుట్‌బాల్‌లో తమ దేశ యువ ఆటగాళ్లను మరింత ప్రోత్సహించే దిశగా తన వంతు ప్రయత్నిస్తానని, వారికి ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని అన్నాడు. తానెప్పుడూ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తానని.. క్లబ్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. మున్ముందు రష్యా జట్టులో చక్కటి నైపుణ్యమున్న ఆటగాళ్లు వస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Story first published: Tuesday, October 2, 2018, 10:01 [IST]
Other articles published on Oct 2, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X