పద్మశ్రీ అవార్డుకు సునీల్ ఛెత్రి పేరు సిఫారసు!

హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి పేరును దేశ నాలుగో అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీకి అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం(ఏఐఎఫ్‌ఎఫ్) సిఫారసు చేసింది. ఇప్పటివరకు భారత్ తరఫున సునీల్ ఛెత్రి 97 మ్యాచ్‌లలో 56 గోల్స్ సాధించాడు.
దీంతో భారత్ తరఫున వరల్డ్ పుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఫార్వర్డ్ ప్లేయర్‌గా ఛెత్రి టాప్-5లో నిలిచాడు. అందుకే ఈ అరుదైన గౌరవానికి ఛెత్రి అర్హుడని ఫుట్‌బాల్ సంఘానికి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. 'భారత పుట్‌బాల్ తరుపున ఈ అవార్డుకు సిఫారసు చేయగలిగే పేర ఏదైనా ఉందంటే అది ఛెత్రి మాత్రమే' అని అన్నారు.
భారత పుట్‌బాల్ రంగానికి అతడు చేసిన సేవలకు గాను ఏఐఎఫ్‌ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఛెత్రితో పాటు జేజే లాల్‌ఫెక్లువా, గురుప్రీత్‌సింగ్ సంధూ పేర్లను అర్జున అవార్డుకు సిఫారసు చేశామని ఏఐఎఫ్‌ఎఫ్ కార్యదర్శి కుశాల్ దాస్ చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications