2019లో ఎఎఫ్‌సీ కప్ సన్నాహాలు!: జూన్‌లో నాలుగు దేశాలతో ఎఐఎఫ్ఎఫ్ టోర్నీ!!

హైదరాబాద్: వచ్చే ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వచ్చే ఏడాది జరిగే ఎఎఫ్‌సీ ఆసియా కప్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నది అఖిల భారత్ ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్). అందుకోసం వివిధ ఖండాలకు చెందిన నాలుగు దేశాల జట్లతో టోర్నమెంట్ నిర్వహించ తలపెట్టింది ఎఐఎఫ్ఎఫ్. వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి 10 తేదీ వరకు నాలుగు దేశాల జట్లతో అంతర్ ఖండ దేశాల టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ముంబైలో ప్రకటించింది. గమ్మత్తేమిటంటే జూన్ 14వ తేదీ నుంచి రష్యాలో ఫిఫా వరల్డ్ కప్ సంరంభం ప్రారంభానికి ముందే ఈ టోర్నమెంట్ ముగుస్తుంది.

ఈ నాలుగుదేశాల టోర్నమెంట్‌లో భారతదేశం, దక్షిణాఫ్రికా,
న్యూజిలాండ్, చైనీస్ తైపేయి పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్‌కు ఆసియా ఫుట్ బాల్ కాన్పిడరేషన్ (ఎఎఫ్సీ), ఓసియన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఓఎఫ్సీ), కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆఫ్రికనె డీ ఫుట్ బాల్ ప్రాతినిధ్యం వహించనున్నాయి.

యూఏఈలో జరిగే ఎఎఫ్సీ టోర్నీకి సన్నద్ధం కానున్న భారత్ జట్టు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వచ్చే ఏడాది జరిగే ఎఎఫ్‌సీ కప్ టోర్నమెంట్‌కు భారత జట్టును సన్నద్ధం చేయడమే ఎఐఎఫ్ఎఫ్ లక్ష్యంగా ఉంది. జూన్ ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు నాలుగు దేశాలకు మొదటి జట్లు ప్రాతినిధ్యం వహిస్తాయని అంచనా వేస్తున్నట్లు ఎఐఎఫ్ఎఫ్ తెలిపింది.

అంతర్‌ఖండ దేశాలతో ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వహణతో ఆయా
దేశాల జట్లతో జరిగే మ్యాచ్‌ల్లో జట్టు శక్తిమంతంగా అభివ్రుద్ధి చెందాలన్నదే లక్ష్యమని ఎఐఎఫ్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుషాల్ దాస్ తెలిపారు. ఇతర దేశాల్లో ఆటపై పట్టు గల జట్లతో ఆడితే శక్తి సామర్థ్యాలు పెంచుకోవచ్చునని భావిస్తున్నామని, ఆసియా కప్ టోర్నమెంట్‌లో పాల్గొనడమే లక్ష్యమని చెప్పారు.

మా జట్టు గెలుస్తుందా
ఇంటర్నేషనల్ కప్ ప్రధాన ఉద్దేశ్యం మా జట్టు గెలుస్తుందా.. లేదా అనేదే కాకుండా జట్టుకు ప్రత్యర్థులు ఎంతటి స్థాయిలో ఉన్నారనేది తెలుసుకోవాడానికి అని ఏఐఎఫ్ఎఫ్ జనరల్ సెక్రటరీ కుశాల్ దాస్ అన్నారు. ఆసియన్ కప్ ఆడడానికి ఈ జట్లతో ఆడేదంతా ప్రాక్టీసుగానే చెప్పాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications