న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

'ఇరాన్ ప్లేయర్లకు మేం బూట్లు ఇవ్వబోం'

Ahead of FIFA World Cup, Nike Withdraws Supply of Boots to Iran Squad After US Sanctions

హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ సంస్థ నైక్‌పై ఇరాన్ ఫుట్‌బాల్ అభిమానులు మండిపడుతున్నారు. నైక్ సంస్థ తయారు చేసే ఉత్పత్తులను నిషేధించాలని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇరాన్ దేశంపై తాజాగా విధించిన అమెరికా ఆంక్షలు అమలులోకి రావడమే. ఈ నేపథ్యంలో ఇరాన్ జాతీయ‌ ఫుట్‌బాల్ జట్టుకు బూట్లు సరఫరా చేయలేమని నైక్ చేతులెత్తేసిందంటూ.. ఓ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ఇరాన్‌పై కొత్తగా ఆంక్షలను తిరిగి విధించడంపై తాము బూట్లను సరఫరా చేయడాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు నైక్ వెల్లడించింది. నైక్ కంపెనీ నిర్ణయంతో ఇరాన్ ప్లేయర్స్ తీవ్ర నిరాశకు గురయ్యారని, ఫిఫా నిర్వాహకులు తమ క్రీడాకారులకు సాయం చేయాలని ఆ జట్టు ప్రధాన కోచ్ కార్లోస్ క్విరోజ్ ఫిఫాను కోరాడు. కీలకమైన మ్యాచ్‌లకు ముందు క్రీడాకారులు తమ స్పోర్ట్స్ పరికరాలను మార్చుకోవడం ఇబ్బందిగా ఉంటుందని, ఇది సరైన సమయంకాదని ఆందోళన వ్యక్తం చేశారు.

మేము కేవలం మేనేజర్స్, ఫుట్‌బాలర్స్ మాత్రమే. దేశాల మధ్య ఉన్న నెలకొన్న పరిణామాల మధ్య మేము జోక్యం చేసుకోలేం. ఈ విషయంలో ఫిఫా తమకు సహాయం చేయాలని కోరుతున్నామని కార్లోస్ వెల్లడించారు. ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-బిలో ఉన్న ఇరాన్ ప్రపంచకప్ సమరంలో రెండో రోజులో భాగంగా.. జూన్ 15న తన తొలి మ్యాచ్‌లో మొరాకో జట్టును ఢీకొనబోతోంది.

దీంతో నెటిజన్లు తమ నిరసన తెలియజేస్తూ.. ఒకవేళ ఇరాన్.. ఇజ్రాయేల్‌తో ఫుట్‌బాల్ ఆడటం మానేస్తే.. అది ఒక రాజకీయ కోణమవుతోంది. కానీ, నైక్ ఇరాన్ ప్లేయర్లకు బూట్లు ఇవ్వకపోవడం సమంజసం కాదు. నైక్ అనేది ఓ ప్రైవేటు కంపెనీ. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేనిది. వినియోగదారులను సంతృప్తి పరచడం దాని బాధ్యత.' అని ఇరాన్ జట్టు కోచ్ భావాన్ని వ్యక్తపరిచాడు.

Story first published: Thursday, June 14, 2018, 15:15 [IST]
Other articles published on Jun 14, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X