
హైదరాబాద్: మాంచెస్టర్ సిటీ ఫార్వార్డ్ ఆటగాడు సెర్జియో అగురో 2020వరకు తన జట్టుతోనే ఉండాలని ఆశపడుతున్నాడు. అర్జెంటీనా అంతర్జాతీయ జట్టుకు ఎతిహాద్ స్టేడియం వద్ద 2020 అర్ధభాగం వరకు పనిచేయాలని ఇంతకుముందే ఒప్పందం కుదుర్చుకుంది.
ఇప్పటి వరకు 17 ప్రీమియర్ లీగ్‌లు ఆడిన అగురో మొత్తంగా 13 గోల్‌లు సాధించాడు. నాకు మేనేజర్ పెప్ గార్డియోలాతో ఎటువంటి విభేదాలు లేవు. ఇంకా నాకే ఆయన భవిష్యత్ పై అనుమానంగా ఉంది.
వాట్ ఫర్డ్ 3-1 తేడాతో గెలుపొందిన అనంతరం అగురో మీడియాతో ఒప్పందం ప్రకారం.. నేను 2020 వరకు ఇదే జట్టులో కొనసాగుతానన్న నమ్మకాన్ని వ్యక్తపరచాడు. ఈ సీజన్ చివరి వరకు వరకు తన వల్ల అయినంత కష్టపడతానని
పేర్కొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూద్దామంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
'అసలు నా ఉద్ధేశ్యం జట్లు మారాలని కాదు. మనమెవ్వరం నిర్ణయాలు తీసుకోవడానికి జట్టు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటా.అని నమ్మకాన్ని వెలిబుచ్చాడు.
ప్రస్తుత సూపర్ లీగ్‌లో హర్రీ కేన్(18), మొహమ్మద్ సలాహ్(17), రహీమ్ స్టెర్లింగ్(14)లు మాత్రమే అగురో (13) కంటే ఎక్కువ గోల్‌లు చేశారు.
మాంచెస్టర్ సిటీ మొత్తం ఆడిన 22 మ్యాచ్ లలో 20 గెలిచింది. రెండు డ్రా అయింది. దీంతో ప్రస్తుతం 15పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌లో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.