Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నా బూట్ల దుమ్ము దులిపాల్సిందే'

After Mbappe matches another Pele record, Brazilian legend issues warning to French star

హైదరాబాద్: భారీ అంచనాలతో మొదలుపెట్టిన ఫైనల్ సమరంలో ఫ్రాన్స్ జట్టే పైచేయి సాధించి క్రొయేషియాను చిత్తు చేసింది. ఈ హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్‌ యువ కెరటం కిలాన్ ఎంబాపె అరుదైన రికార్డును సొం‍తం చేసుకున్నాడు. ఆదివారం క్రోయేషియాతో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఈ స్టార్‌ ఆటగాడు 65వ నిమిషంలో గోల్‌ సాధించి బ్రెజిల్‌ దిగ్గజం పీలే (1958లో) తర్వాత అతి పిన్న వయసులో వరల్డ్‌ కప్‌ ఫైనల్లో గోల్‌ కొట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ 4-2తో నెగ్గి 20 ఏళ్ల తర్వాత రెండోసారి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే.

World Cup 2018: The bizarre trophy presentation caps tournament

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ఇక అంతకముందు నాకౌట్‌ సమరంలోను గోల్‌ సాధించిన ఎంబాపే ఇదే..పీలే రికార్డును సమం చేశాడు. మ్యాచ్‌ అనంతరం 'మైలవ్‌' అనే క్యాప్షన్‌తో ట్రోఫీని ముద్దాడుతూ.. ఫోజిచ్చిన ఫొటోను ఎంబాపె ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు పీలేనే తొలుత స్పందించడం విశేషం. 'కైలిన్‌ నా రికార్డును సమం చేశాడు.. ఇక నా బూట్లకున్న దుమ్ముదులిపి బరిలోకి దిగాల్సిందే' అని ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు 'వెలకమ్‌ టూ ది క్లబ్‌' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ వైరల్‌ అయ్యాయి.

జట్టు కోచ్‌గా ప్రపంచచకప్పు గెలిచిన మూడో వ్యక్తిగా ఫ్రాన్స్‌ కోచ్‌ డెషాంప్స్‌ ఘనత సాధించాడు. ఉత్తమ యువ ఆటగాడికి ఇచ్చే 'యంగ్ ప్లేయర్' అవార్డ్ ఫ్రాన్స్‌‌కి చెందిన ఎంబపె‌కి దక్కింది.

1
958085

క్రొయేషియా ఆటగాడు మాన్‌జుకిచ్‌ (18వ నిమిషం) సెల్ఫ్‌ గోల్‌తో ఫ్రాన్స్‌ ఖాతా తెరవగా... గ్రీజ్‌మన్‌ (38వ ని.లో), పోగ్బా (59వ ని.లో), ఎంబాపె (65వ ని.లో) తమ జట్టు తరఫున గోల్స్‌ కొట్టారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్‌ (28వ ని.లో), మాన్‌జుకిచ్‌ (69వ ని.లో) గోల్స్‌ సాధించారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌ 2-1తో ఆధిక్యంలో నిలవగా... ఆ తర్వాత మరో రెండు గోల్స్‌తో ఫ్రాన్స్‌ తమ ప్రత్యర్థికి అవకాశం లేకుండా చేసింది. మరి కొద్ది నిమిషాలలో మ్యాచ్ ముగుస్తుందనగా.. క్రొయేషియాకు వృథా ప్రయాస మిగిలింది. దీంతో ఫ్రాన్స్‌ సునాయస విజయం అందుకుంది.

Story first published: Monday, July 16, 2018, 14:25 [IST]
Other articles published on Jul 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+