Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉబ్బితబ్బిబయ్యాడు: ఆ చిన్నారిని కలిసిన మెస్సీ

హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు జెర్సీని పోలిన ఓ పాస్లిక్ బ్యాగ్‌ను డ్రెస్‌గా ధరించి ఇంటర్‌నెట్‌లో సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ బాలుడు ముర్తజా అహ్మది తన ప్రేరణగా నిలచిన పుట్ బాల్ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీని డిసెంబర్ 13 (మంగళవారం) కలుసుకున్నాడు.

అచ్చం లియోనల్ మెస్సీలాగా బంతిని తన్నుతూ హల్‌చల్ చేసిన ఆ బాలుడు మంగళవారం బార్సిలోనా సాకర్ స్టార్‌ను దోహాలో కలుసుకున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన అల్ అహిల్ జట్టుతో స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు ఇక్కడకు వచ్చిన మెస్సీ ఆ చిన్నారితో ఉత్సాహంగా గడిపాడు.

Afghan 'plastic bag shirt' boy meets idol Lionel Messi

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆ చిన్నారి చేతిని మెస్సీ పట్టుకుని మైదానంలోకి తీసుకెళ్లాడు. కాగా, 2022 ఖతార్ వరల్డ్ కప్ నిర్వాహకులు వీరిద్దరిని కలిపారు. మెస్సీతో చిన్నారి ఉన్న ఫోటోను కూడా తమ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

తన సూపర్ స్టార్ మెస్సీని కలుసుకోవాలన్న తన కల నేరవేరిందని ఆరేళ్ల అహ్మది సంతోషం వ్యక్తం చేశాడు. మెస్సీతో కలిసి ఉన్న క్షణాలను గుర్తు చేసుకుని ఉబ్బితబ్బిబయ్యాడు. వివరాల్లోకి వెళితే ఈ ఏడాది ఆరంభంలో అర్జెంటీనా టీమ్ జెర్సీ మాదిరిగా ఉన్న ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌ను అహ్మది డ్రెస్ మాదిరిగా కుట్టించుకుని వెనుక మార్కర్ పెన్‌తో మెస్సీ 10 అని రాసుకున్నాడు.

Afghan 'plastic bag shirt' boy meets idol Lionel Messi

పుట్ బాల్ ఆడుతుండగా అతని సోదరుడు హుమాయున్ ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అంతే ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్ అయిపోయి చివరకు మెస్సీకి చేరింది. చిన్నారి ఉత్సాహానికి ముగ్దుడైన మెస్సీ తన జెర్సీని కానుకగా పంపించాడు. ఆ తర్వాత మంగళవారం దోహాలో చిన్నారి అహ్మదిని నేరుగా కలుసుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+