న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

33 ఏళ్ల తర్వాత ఇరాన్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత్

AFC U-16 Championship: Niraj Kumars Heroics Helps India Earn Draw Against Iran

హైదరాబాద్: గోల్‌ కీపర్‌ నీరజ్‌ కుమార్‌ అద్భుత ప్రదర్శన చేయడంతో ఏఎఫ్‌సీ అండర్‌-16 ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో సోమవారం ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత్‌ 0-0తో డ్రాగా ముగించింది. ఇలా 33 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు ఇరాన్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

ఏ వయసు విభాగాల్లో అయినా చివరగా ఇరాన్‌ను భారత్‌ 1984 ఆసియా కప్‌ ఫైనల్లో నిలువరించింది. ఆ మ్యాచ్‌ కూడా గోల్సేమీ నమోదు కాకుండా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తనకంటే ఎంతో మెరుగైన ఇరాన్‌ను భారత యువ జట్టు కట్టడి చేసిన తీరు నిజంగా అద్భుతం.

76వ నిమిషంలో ఆ జట్టుకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్ కీపర్ నీరజ్‌ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ''ఈ మ్యాచ్‌ గెలవాల్సింది. మంచి ప్రదర్శన కనబరిచాం. కుర్రాళ్లు వంద శాతం కృషి చేశారు. ప్రణాళిక ప్రకారం ఆడారు'' అని ప్రధాన కోచ్‌ బిబియానో ఫెర్నాండెస్‌ తెలిపాడు.

Story first published: Tuesday, September 25, 2018, 14:59 [IST]
Other articles published on Sep 25, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X