ఏఎఫ్‌సీ ఆసియా కప్: యూఏఈ చేతిలో భారత్ ఓటమి

హైదరాబాద్: ఆసియాకప్ ఫుట్‌బాల్ టోర్నీ భారత జోరుకు బ్రేక్ పడింది. తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసి మంచి ఊపు మీదున్న భారత్.. గురువారం యూఏఈతో జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో 0-2 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది.
ఫినిషింగ్ లోపంతో
గోల్ చేసేందుకు పలుమార్లు అవకాశాలు వచ్చినా ఫినిషింగ్ లోపంతో భారత ఫుటబాల్ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. యూఏఈ ఆటగాళ్లు ఖల్ఫాన్ ముబారక్(41వ నిమిషం), అలీ అహ్మద్ మక్భూత్ (88వ నిమిషం) గోల్స్ కొట్టి జట్టుకు తొలి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో భారత్ గట్టిగానే పోరాడినా.. యూఏఈ జట్టు ముందు నిలువలేకపోయింది.
సమానమైన అవకాశాలు
యూఏఈ ఆటగాళ్లు పాస్‌లను చక్కగా అందుకోవడంతో బంతి ఎక్కువ శాతం ఆ జట్టు ఆధీనంలోనే ఉంది. ఆరంభంలో రెండు జట్లకు సమానమైన అవకాశాలు వచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయాయి. భారత జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై పలుమార్లు దాడులు ప్రయత్నించినప్పటికీ... ఫౌల్స్ ఎక్కువగా చేసింది. అంతేకాదు పాస్‌లలో సైతం వెనుకబడింది.
బహ్రెయిన్‌పై గెలిస్తే నాకౌట్ అవకాశాలు
సందేశ్ జిగన్స్ కొట్టిన కార్నర్ షాట్‌ను అనురిధ్ థాపా హెడ్డర్ గోల్‌పోస్ట్ సమీపం నుంచి బయటకు దూసుకెళ్లింది. దీంతో భారత ప్రయత్నం వృథాగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్‌కు నాకౌట్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. ప్రస్తుతం 3 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో భారత్... సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో బహ్రెయిన్‌తో భారత్ గెలిస్తే ముందంజ వేస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications