హైదరాబాద్: ఎఫ్‌సి గోవా ఫ్రాంచైజీ సహ యజమానిగా ఇండియన్ ఫుట్‌బాల్ ప్రమోషన్‌లో భాగస్వామ్యంఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫ్రాంచైసీ 'ఎఫ్‌సి గోవా' యాజమాన్యంలో మరో మార్పు రానున్నది. స్టాక్‌మార్కెట్‌లో ఉత్తమ ఇన్వెస్టర్‌గా పేరొందిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇక 'ఎఫ్‌సి గోవా' సహ యజమాని కానున్నారు.
ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ 'వీడియోకాన్' ్‌తోపాటు శ్రీనివాస్ డెంపో, దత్తరాజ్ సాల్‌గావోంకర్‌ల మదిలో పుట్టిన ఆలోచనలకు నిదర్శనమే ఐఎస్‌ఎల్ ఫ్రాంచైసీ 'ఎఫ్‌సి గోవా' ప్రారంభం. వీరు పదేళ్లకు పైగా యాజమాన్య హక్కులతో ఎఫ్‌సి గోవా జట్టును రూ.125 కోట్లకు 2014లో ఐఎస్‌ఎల్ నిర్వాహకులు నిర్వహించిన వేలంలో కొనుగోలుచేశారు.
అయితే డెంపో, సాల్‌గావోంకర్ ఫ్రాంచైసీ యాజమాన్యం నుంచి వైదొలగడంతో వారి మెజారిటీ వాటాను కాసినో ఎంటర్‌ప్రైనర్ జావ్‌దేవ్ మూడీ కొనుగోలుచేశారు. మోడీ ఫ్రాంచైసీలో 66 శాతం వాటా కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. అయితే ఆయనకు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రూపంలో కొత్త ఇన్వెస్టర్ భాగస్వామిగా చేరారు. మోడీ, ఝున్‌ఝున్‌వాలాలను తరుచుగా భారత్ వారెన్ బఫెట్ అని వంటి వ్యాపార భాగస్వాములని చెబుతుంటారు.

తగ్గనున్న వీడియోకాన్ వాటా
ఝున్‌ఝున్‌వాలా ప్రారంభంలో వీడియో కాన్ నుంచి వాటా కొనుగోలుచేస్తాడు. దీంతో వీడియో కాన్‌వాటా తగ్గుతుంది. వాటా తగ్గినప్పటికీ వీడియో కాన్ ఫ్రాంచైసీ నుంచి వైదొలగదని దాని సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్నది. ఎఫ్‌సి గోవాలో వీడియోకాన్ 22 శాతం వాటా కలిగి ఉన్నది.
దీనికి తోడు టీమిండియా క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ కూడా ఎఫ్‌సి గోవా యాజమాన్య భాగస్వామిగానే ఉన్నారు. ఆయన కేవలం 12 శాతం వాటా కలిగి ఉన్నారు. తొలి రెండు ఐఎస్‌ఎల్ సీజన్లలో సుమారు రూ. 2 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టిన కోహ్లీ.. కేవలం స్వీట్ ఈక్విటీ షేర్లకే తన పాత్ర పరిమితం చేయనున్నారు.