ముంబై: నాలుగు మ్యాచ్‍లలోనూ ఒక్కదాంట్లోనూ విజయం సాధించని ఎఫ్‍సి గోవా జట్టు తనకు తాను బ్రేక్ పాయింట్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. శుక్రవారం సాయంత్రం ముంబై సిటీతో జరిగే మ్యాచ్‍లో విజయం సాధించి సంప్రదాయానికి తెర దించాలని భావిస్తోంది.
బ్రెజిలియన్ లెజెండ్ జికో శిక్షణలో గత ఏడాది రన్నరప్‍గా నిలిచిన గోవా జట్టు.. ఐఎస్ఎల్ 3 ఎడిషన్‍లో నాలుగు మ్యాచ్‍లు ఆడినా ఒక్క విజయాన్ని కూడా నమోదుచేయలేదు. మాజీ చాంపియన్లు అట్లెటికో డీ కోల్ కతాతో ఈ నెల 16న జరిగిన మ్యాచ్ ను డ్రాగా ముగించిన గోవాన్లు కనీసం 1 - 1 స్కోర్ తేడాతో ముంబైతో జరిగే మ్యాచ్ ను డ్రాగా ముగించాలని ఆసక్తితో ఉన్నారు.
హీరోయిక్ గోల్ కీపర్ సుభాషిష్ రాయ్ చౌదరి 20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఐఎస్ఎల్ టోర్నీలో పాల్గొనేందుకు ముందుకు రావడం గోవాకు కలిసివచ్చే అంశం. 2014లో ఐఎస్ఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా తొలి ఐదు మ్యాచ్‍ల్లో ఏ జట్టు విజయం సాధించకుండా ఉండలేదు. కానీ ఎఫ్ సి గోవా మాత్రం ముంబైతో ఓటమి పాలవ్వడంగానీ, డ్రాగా ముగించడం గానీ రికార్డు నెలకొల్పినట్లవుతుంది. అట్లెటికో డీ కోల్‍కతాతో జరిగిన మ్యాచ్‍లో ఓటమితో గోవా వరుసగా నాలుగో సారి పరాజయం పాలైంది.
గోవా జట్టు, కోచ్ జికో 2014 నుంచి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తొలి నాలుగు మ్యాచ్‍ల్లోనూ ఓటమి పాలైనా తర్వాత కోలుకుని సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నది. ఈ సారి కూడా జికో అదే విశ్వాసంతో ముందుకెళుతూ గోవా తనకు తాను కోలుకుని దూసుకెళ్లదని భావిస్తున్నారు. వరుసగా మూడు మ్యాచ్‍ల్లోనూ ఓటమి పాలైన గోవా జట్టు గెలుపు అంచులకు దగ్గర్లోనే ఉన్నదని అంచనా వేస్తున్నారు.
'మేం బాగానే ఆడుతున్నాం. ఓటమి పాలైనా మేం భిన్నమైన ఫలితాలు సాధిస్తాం. మేం రెండు మ్యాచ్ లలో ఓటమి పాలవ్వడానికి మా పొరపాట్లే కారణం గానీ, ప్రత్యర్థి జట్ల గొప్పతనమేమీ లేదు' అని జికో వ్యాఖ్యానించారు. కేరళ బ్లాక్ బస్టర్స్‌తో 0 - 1 తేడాతో ఓటమి, ఢిల్లీ డైనమోస్‌తో 3 - 3 స్కోర్ తేడాతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

అక్టోబర్ 11న అట్లెటికో డీ కోల్‌కతాతో ముంబై సిటీ జట్టు డ్రాగా ముగించుకున్నది. కోస్టా రిచ్ కోచ్ అలెగ్జాండ్రి శిక్షణలో మెరుగ్గా పరివర్తన చెందిన ముంబై సిటీ పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. తాజాగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టును దాటిపోవాలని ఆకాంక్షిస్తున్నది.
'మేం ప్రతి మ్యాచ్ లోనూ మంచిగా ఆడుతున్నాం. ఈ తరహా గేమ్స్ వల్ల లీగ్ కు ఆరోగ్యకరం, మంచిది కూడా' అని ముంబై సిటీ కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ వ్యాఖ్యానించాడు. ఢిల్లీతో రెండుసార్లు జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలవ్వడంతో డిస్సప్పాయింట్ అయ్యాడు. గత మూడు మ్యాచ్ లకూ దూరంగా ఉన్న సారధి డియాగో ఫోర్లాన్ శుక్రవారం సాయంత్రం జరిగే మ్యాచ్ లో పాల్గొంటాడనని ధ్రువీకరించాడు. అయితే గాయంతో బాధపడుతున్న అన్వర్ అలీ సంగతి చెప్పలేదు.
ఇక ఎఎఫ్‍సి టోర్నీలో ఐ - లీగ్ క్లబ్ బెంగళూర్ ఎఫ్ సి క్లబ్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లి రికార్డు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన ముంబై సిటీ కీలక స్ట్రయికర్ సునీల్ ఛెత్రి ఈ మ్యాచ్‍కు కూడా దూరం కానున్నాడు. 'ప్రస్తుతం ఎఫ్ సి గోవా జట్టు గెలుపొందకపోతే అర్హత సాధించలేదు. వారు ధైర్యంగా ఆడుతున్నారు. ఫుట్ బాల్ లో ధైర్యంగా అటాకింగ్ చేయడమే ప్రధానం. మా జట్టుతో జరిగే మ్యాచ్‍లో అదే జరుగుతుందని భావిస్తున్నా. గత రెండు సెషన్లలో చివరి దశలో ప్లే ఆఫ్‍కు అర్హత సాధించింది. మేం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది' అని అలెగ్జాండ్రీ గుమారెస్ వ్యాఖ్యానించాడు.
ఎఎఫ్‌సి ఫైనల్స్‌కు కీపర్ అమ్రిందర్ మిస్
బెంగళూరు: వచ్చేనెల ఐదో తేదీన జరిగే ఎఎఫ్‌సి ఫైనల్స్ మ్యాచ్‌కు బెంగళూర్ ఎఫ్ సి గోల్ కీపర్ అమ్రిందర్ సింగ్ మిస్సవ్వనున్నాడు. దోహాలో ఇరాకీ క్లబ్ ఖ్వువా అల్ జాబితా క్లబ్ తో జరిగే ఏషియాన్ ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి) ఫైనల్స్ జరుగనున్నది. బుధవారం జొహొర్ దారుల్ తాజిమ్‌పై జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రిఫరీ రెండోసారి ఎల్లోకార్డు చూపడంతో ఒక మ్యాచ్ నిషేధం అమలులోకి వస్తుండటమే దీనికి కారణం.
ఐ - లీగ్ చాంపియన్ క్లబ్ అయిన బెంగళూరు ఎఫ్‌సి తొలిసారి ఖండాంతర టోర్నీలో ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. అయితే అమ్రిందర్ సింగ్ పై ఒక మ్యాచ్ నిషేధం అమలు చేయనున్నట్లు ఎఎఫ్ సి నుంచి అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) మెయిల్ వచ్చింది. అమ్రిందర్ సింగ్ తొలి రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ ఆడలేదు. తాజాగా ఫైనల్స్‌లో అమ్రిందర్ సింగ్ స్థానే లాల్తౌమ్మవైయారాల్టే గోల్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.