Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కాశ్మీర్‌లో స్ధానికంగా సంచలనం: ఉగ్రవాద సంస్ధలో చేరిన యువ పుట్‌బాలర్

A Kashmiri tragedy: Anantnag footballer who worked for NGO joins Lashkar-e-Taiba, shocks family

హైదరాబాద్: ఉగ్రవాదం పట్ల జమ్మూ కాశ్మీర్‌కు చెందిన యువత ఆకర్షితులవతూనే ఉన్నారనేందుకు తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది. అనంత్‌నాగ్‌కు చెందిన 20 ఏళ్ల యువ ఫుట్‌బాలర్ మాజిద్‌ ఖాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో చేరడం కాశ్మీర్‌లో కలకలం సృష్టించింది.

అనంత్ నాగ్‌లోని సాధిక్‌బాద్ ప్రాంతానికి చెందిన మాజిద్ ఖాన్ అనే యువకుడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. గతేడాది ఆగస్టులో భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన తన స్నేహితుడు యావర్ నిసార్ ప్రేరణతో మాజిద్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మాజిద్ ఏకే-47 ధరించి ఉన్న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. జిల్లా స్థాయిలో మంచి పుట్‌బాల్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మాజిద్‌ ఖాన్ ఇప్పుడు ఉగ్రవాద సంస్ధలతో చేరడం స్ధానికంగా సంచలం అయింది.

జమ్మూ కాశ్మీర్‌లోని పలు ఉగ్రవాద సంస్ధలు స్ధానిక యువతను ఉగ్రవాదం దిశగా ప్రేరేపిస్తున్నట్లు గతంలో పలుమార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద సంస్ధలు ఇచ్చిన ప్రోద్భలంతోనే మాజిద్ కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిసిందని అనంత్‌నాగ్ సీనియర్ పోలీస్ అధికారి అల్తాఫ్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, November 16, 2017, 12:10 [IST]
Other articles published on Nov 16, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+