ఆల్‌టైమ్ గ్రేటేస్ట్ ప్లేయర్: రెండు జట్లకు ఆడిన వరల్డ్ కప్ హీరో

హైదరాబాద్: ప్రస్తుతం యావత్ ప్రపంచం మొత్తం సాకర్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసిన ఫిఫా వరల్డ్ కప్ గురించే మాట్లాడుకుంటున్నారు. జూన్ 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 21వ ఫిఫా వరల్డ్ కప్‌కు రష్యా ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలువురు సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో మైఖేల్ తెలుగు గత వరల్డ్ కప్‌లకు సంబంధించిన స్మృతులను అభిమానుల కోసం ప్రత్యేకంగా కథనాలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం 1950 వరల్డ్ కప్‌లో హీరో అయిన ఉరుగ్వే ఆటగాడు అల్సిడెస్ గిగియా గురించి తెలుసుకుందాం. 1942, 46ల్లో జరగాల్సిన రెండు వరల్డ్‌కప్‌లు రెండో ప్రపంచ యుద్ధం కారణంగా జరగలేదు.
ఆ తర్వాత 1950లో బ్రెజిల్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఈ వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకుగానూ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 16 జట్లు అర్హత సాధించాయి. ఇందులో భారత్ కూడా ఉంది. కానీ చివర్లో కొన్ని కారణాలతో భారత్, టర్కీ, స్కాట్లాండ్ టోర్నీ ప్రారంభానికి ముందే వైదొలిగాయి.

ఫైనల్‌కు అర్హత సాధించిన బ్రెజిల్, ఉరుగ్వే
దీంతో ఈ టోర్నీలో 13 జట్లే పాల్గొన్నాయి. దీంతో గ్రూపు స్టేజీలో ఈ 13 దేశాలు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడ్డాయి. గ్రూపు-1లో ఆతిథ్య బ్రెజిల్, గ్రూపు-2లో స్పెయిన్, గ్రూపు-3లో స్వీడన్, గ్రూపు-4లో ఉరుగ్వే అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్‌లో తర్వాత తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఉరుగ్వే, బ్రెజిల్ ఫైనల్‌కు చేరుకున్నాయి. బ్రెజిల్ ఆతిథ్యమిస్తోన్న వరల్డ్ కప్‌లో ఆతిథ్య బ్రెజిల్ ఫైనల్‌కు చేరుకోవడంతో బ్రెజిల్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. లీగ్ స్టేజి నుంచి బ్రెజిల్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఫైనల్లో బ్రెజిల్ గెలుస్తుందని అందరూ ఓ భావనకు వచ్చారు.

47నిమిషంలో తొలి గోల్ చేసిన బ్రెజిల్
ఇందుకు తగ్గట్టుగానే మ్యాచ్ ఆరంభమైన 47నిమిషంలో బ్రెజిల్ స్టైకర్ ఫ్రికా తొలి గోల్ వేశాడు. ఆ తర్వాత, ఉరుగ్వే మిడ్‌ఫీల్డర్ స్కఫినో 66 నిమిషంలో ఉరుగ్వే తరఫున గోల్ చేశాడు. దీంతో అప్పటివరకు విజయం బ్రెజిల్‌దే అన్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో నిర్ణయాత్మక గోల్ కోసం రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. మరోవైపు మ్యాచ్ సమయం కూడా ముగుస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. అప్పటివరకూ ప్రశాంతంగా కనిపించిన ఉరుగ్వే ఆటగాడు అల్సిడెస్ గిగియా ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. వరల్డ్‌కప్ మాదే అనుకున్న బ్రెజిల్ అంచనాలను తలకిందులు చేస్తూ 79 నిమిషంలో గోల్‌తో ఉరుగ్వేకు అద్భుత విజయాన్ని అందించాడు.

ఒక్కసారిగా హీరోగా మారిపోయిన గిగియా
ఫలితంగా 2-1తేడాతో ఉరుగ్వే రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం అల్సిడెస్ గిగియా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. అయితే ఉరుగ్వేకు అద్భుత విజయాన్ని అందించిన అల్సిడెస్ గిగియా ఆ తర్వాత ఇటలీ జాతీయ జట్టుకు కూడా ఆడాడు. 1926లో ఉరుగ్వేలో జన్మించిన అల్సిడెస్ గిగియా ముందు 1950-52 కాలంలో ఉరుగ్వే ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు ఆడగా, ఆ తర్వాత 1957-59లో ఇటలీ జాతీయ జట్టుకు కూడా ఆడాడు. అయితే, ఇప్పుడు అల్సిడెస్ గిగియా గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే..!

88వ ఏట కన్నుమూసిన అల్సిడెస్ గిగియా
రష్యా ఆతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్ కప్‌కు ముందు అత్యుత్తమ ఫిఫా వరల్డ్‌కప్ ప్లేయర్ కోసం ఇటీవల నిర్వాహకులు ఓటింగ్ పెట్టారు. సుమారు 5లక్షలకు పైగా అభిమానులు గిగియాకే ఓటు వేసి వరల్డ్‌కప్ గ్రేటేస్ట్ ప్లేయర్ స్థానాన్ని అతడికే కట్టబెట్టారు. దీంతో ‘1950 ప్రపంచకప్ హీరో అల్సిడెస్ గిగియాను ఫిఫా వరల్డ్‌కప్ గొప్ప ఆటగాడిగా పేర్కొంటూ' ఫిఫా తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కాగా, 1926లో జన్మించిన అల్సిడెస్ గిగియా 2015, జులై 16న తన 88వ ఏట ఉరుగ్వేలో కన్నుమూశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications