వరల్డ్ కప్: తొలి మ్యాచ్‌తో పాటు భారత్-పాక్ హౌస్ పుల్ (ఫోటోలు)
అడిలైడ్: ఐసీసీ వరల్డ్ కప్ 2015లో భాగంగా న్యూజిలాండ్-శ్రీలంక మధ్య ఫిబ్రవరి 14న జరగనున్న ప్రారంభ మ్యాచ్ టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అన్ని మ్యాచ్‌లకు సంబంధించి 825,000 టికెట్లు అమ్ముడైనట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది.
ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో శనివారం, ఆదివారం కలిపి మొత్తం 4 మ్యాచ్‌లు ఆడనున్నట్లు ఐసీసీ తెలిపింది. ఫిబ్రవరి 15న జరిగే భారత్ - పాకిస్ధాన్ మ్యాచ్ టికెట్లన్నీ కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి.
వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఈ వీకెండ్ మ్యాచ్‌లు:
ఫిబ్రవరి 14 (శనివారం)
న్యూజిలాండ్ Vs శ్రీలంక (క్రిస్ట్‌చర్చ్) - టికెట్లన్నీ అమ్ముడయ్యాయి
ఆస్ట్రేలియా Vs ఇంగ్లాండ్ (మెల్బోర్న్) - (స్టేడియం కెపాసిటీ: 90,000... విక్రయించింది 85,000) ఇంకా కొన్ని టిక్కెట్లు మిగిలిఉన్నాయి.
ఫిబ్రవరి 15 (ఆదివారం)
సౌత్ ఆఫ్రికా Vs జింబాబ్వే (హమిల్టన్) - (స్టేడియం కెపాసిటీ: 10,000... విక్రయించింది 7,000) ఇంకా కొన్ని టిక్కెట్లు మిగిలిఉన్నాయి.
భారతదేశం Vs పాకిస్తాన్ (అడిలైడ్) - టికెట్లన్నీ అమ్ముడయ్యాయి అమ్ముడయ్యాయి

తొలి మ్యాచ్‌తో పాటు భారత్-పాక్ హౌస్ పుల్
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అన్ని మ్యాచ్‌లకు సంబంధించి 825,000 టికెట్లు అమ్ముడైనట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది.

తొలి మ్యాచ్‌తో పాటు భారత్-పాక్ హౌస్ పుల్
ఈ వీకెండ్ జరిగే మ్యాచ్‌లకు స్టేడియాలన్నీ వీక్షకులతో కిక్కిరిసిపోతాయని ఐసీసీ ప్రకటించింది. వరల్డ్ కప్ లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ హెర్నాన్డ్ ఫ్యాన్స్ అధ్బుతమైన మద్దతుని పొంగిపోయారు. తొలి బంతి ప్రదర్శించక ముందే ఇప్పటి వరకు 825,000 టికెట్లు అమ్మినట్లు ఐసీసీ వెబ్‌సైట్‌లో ఉంచిన వార్తా కథనంలో పేర్కొన్నారు.

తొలి మ్యాచ్‌తో పాటు భారత్-పాక్ హౌస్ పుల్
ఇక ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత్ - పాకిస్ధాన్ మ్యాచ్ ఉందంటే క్రికెట్ అభిమానులకు పండుగే. ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తొలి మ్యాచ్‌తో పాటు భారత్-పాక్ హౌస్ పుల్
ఇందుకు నిదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభించిన 20 నిమిషాల్లో అమ్ముడయ్యాయంటే అతిశయోక్తం కాదంటే నమ్మండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications