
ఫిఫా ఏకగ్రీవ మద్దతు
‘విస్తరణ ప్రతిపాదనలకు చాలా మద్దతు లభిస్తోంది. ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా మద్దతునిస్తున్నారు' అని ఇన్ ఫాంటినో చెప్పాడు. నూతన ప్రతిపాదన కింద రూపొందించిన ఫార్మాట్ ప్రకారం ప్రతి 16 గ్రూపుల్లో టాప్ రెండు జట్లు తక్షణం నాకౌట్ దశకు చేరుకుంటాయి. ప్రస్తుతం కొన్ని గ్రూప్‌ల్లో అన్ని జట్లు ఆడాల్సి రావడం సమస్యాత్మకంగా మారింది.

మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం
టోర్నీలో పాల్గొనే జట్ల పెంపు వల్ల వరల్డ్‌కప్‌లో ఆట ప్రమాణాలు దెబ్బతింటాయా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇన్ ఫాంటినో మాత్రం అవన్నీ ఇప్పటికే లబ్ధి పొందిన జట్ల భయాందోళనలు తప్ప మరేమీ లేదన్నాడు. ప్రపంచంలోని మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించడానికి టోర్నీ ఫార్మాట్ విస్తరిస్తున్నామని చెప్పాడు.

ఎనిమిది జట్లకు అవకాశం కల్పించాలా?
ఎనిమిది జట్లకు అవకాశం కల్పించాలా? 16 జట్లను తీసుకోవాలా? అన్న అంశంపై ద్రుష్టిని కేంద్రీకరించామని ఇన్ ఫాంటినో తెలిపాడు. జట్లు పెరిగినా టోర్నీ నిడివి యథాతథంగా కొనసాగుతుందన్నాడు. ఇంతకుముందు మాదిరిగానే సాకర్ టోర్నీ 32 రోజుల్లోనే ముగిస్తామని స్పష్టంచేశాడు. ఫైనలిస్టులు ఆడే ఏడు మ్యాచ్‌లు కూడా అందులో భాగమేనన్నాడు. ప్లేయర్ల, క్లబ్‌ల షెడ్యూల్‌పై ఏమాత్రం ప్రభావం చూపదని ఇన్ ఫాంటినో వివరించాడు.

ఐ లీగ్‌లో చర్చిల్ బ్రదర్స్
వచ్చే నెల ఏడో తేదీ నుంచి జరిగే ఐ లీగ్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న డెంపో ఎఫ్ సి క్లబ్ నిర్ణయానికి అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) చెక్ పెట్టింది. తక్షణం చర్చిల్ బ్రదర్స్ ఎస్ సి క్లబ్ జట్టును ఐ - లీగ్ టోర్నీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించి డెంపో ఎఫ్ సి యాజమాన్యాన్నే ఇరకాటంలో పెట్టింది. చర్చిల్ బ్రదర్స్ ఎస్ సి జట్టు రెండేళ్ల విరామం తర్వాత ఐ - లీగ్ టోర్నీలో పాల్గొననున్నది.

కార్యవర్గ సభ్యులు ఏకగీవ్రంగా మద్దతు
ఎఐఎఫ్ఎఫ్ జాతీయ కార్యవర్గం అత్యవసరంగా సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. రెడ్ మెచిన్స్ జట్టుకు ఐ - లీగ్ లో చోటు కల్పించేందుకు కార్యవర్గ సభ్యులు ఏకగీవ్రంగా మద్దతు తెలిపారు. గత నెల 28న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా సమావేశమై చర్చిల్ బ్రదర్స్ ఎస్ సి జట్టు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నామని ఎఐఎఫ్ఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఢిల్లీ హైకోర్టు హితవు
2014లో ఐ లీగ్‌లో పాల్గొనేందుకు లైసెన్సింగ్ తప్పనిసరని నిర్వాహకులు నిబంధన పెట్టడంతో చర్చిల్ బ్రదర్స్ జట్టు వైదొలిగింది. కానీ చర్చిల్ బ్రదర్స్ ట్రాక్ రికార్డు, క్లబ్ పత్రాలన్నీ పరిశీలించిన తర్వాత సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎఐఎఫ్ఎఫ్‌కు ఢిల్లీ హైకోర్టు హితవు చెప్పింది.

చెన్నై సిటీ ఎఫ్ సికి అవకాశం
హైకోర్టు తీర్పుకు అనుగుణంగా చర్చిల్ బ్రదర్స్ జట్టును తిరిగి ఐ-లీగ్‌లోకి తీసుకోవడంతో మూడు గోవా జట్లు వైదొలగడంతో ఎఐఎఫ్ఎఫ్ ముందుకు వచ్చిన సమస్యలు తొలగిపోయాయి. చర్చిల్ బ్రదర్స్ ఎస్ సి జట్టుతోపాటు చెన్నై సిటీ ఎఫ్ సి జట్టు చేరికను కూడా ఎఐఎఫ్ఎఫ్ పరిగణనలోకి తీసుకునే అవకాశముంది.


Click it and Unblock the Notifications













