
హైదరాబాద్: కౌరవులు వంద మంది. పాండవులు ఐదుగురు. ఆ రెండింటి సైన్యం తలపడితే అది కురుక్షేత్రం. కానీ, ఇక్కడ మరీ దారుణంగా వంద మందితో కేవలం ముగ్గురే పోరాడారు. అదీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో. గోల్ వేసే వాళ్లు ఆపేవాళ్లు ఇలా సుమారు పదకొండు మంది వరకు కావలసిన మ్యాచ్‌ను కేవలం ముగ్గురే దున్ని పడేశారు.
ఆ కౌరవ సైన్యాన్ని ఎదిరించిన ముగ్గురి పాండవుల యుద్ధమిది. సాధారణంగా ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే ఒక్కో జట్టు తరఫున 11 మంది...అంటే రెండు జట్లతో కలిపి మైదానంలో 22 మంది ఆడటం మనం చూశాం. కానీ, జపాన్‌లో నిర్వహించిన ఓ మ్యాచ్‌లో ఒక జట్టు నుంచి ఏకంగా 100మంది పాల్గొనగా రెండో జట్టు నుంచి కేవలం ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు.
వంద మంది ఆటగాళ్లతో పోటీపడి చివరికి గోల్‌కొట్టి విజయం సాధించింది ముగ్గురు ఆటగాళ్ల జట్టు. ఈ ముగ్గురు జపాన్ తరఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లు హొటారు యమగూచి, హిరోషి కియోటకే, యోసుకి ఇడిగూచిలు. కాగా, ఇక్కడ ప్రత్యర్థి జట్టులో ఉన్న ఆ వంద మంది ఆటగాళ్లు పాఠశాల విద్యార్థులే.
మైదానంలో మూడు అంచెల్లో 30-30-30 చొప్పున బంతిని అడ్డుకునేందుకు సిద్ధమవ్వగా మిగతా పది మంది గోల్ కీపర్లగా బాధ్యతలు నిర్వర్తించారు. వంద మంది నుంచి బంతిని చాకచక్యంగా తప్పించి తీసుకొచ్చిన ముగ్గురు ఆటగాళ్లు చివరకు గోల్ కొట్టి విజయం సాధించారు. ఈ వీడియోను మీరూ చూడండి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.