Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup షెడ్యూల్ వచ్చేసింది!

ప్రతిష్ఠాత్మక ఫిఫా వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 11న మెక్సికో సిటీలోని అజ్టెక్ స్టేడియంలో ఈ మహా సమరం ప్రారంభం కానుంది. అనంతరం 38 రోజుల తర్వాత న్యూజెర్సీలోని మెల్‌లైఫ్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఫిపా పాలక మండలి ప్రకటించింది.

అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఈసారి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగా ఈవెంట్‌లో మొదటిసారిగా 48 జట్లు పాల్గొననున్నాయి. 1970లో మెక్సికో ఒంటరిగా ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు బ్రెజిల్ విజేతగా నిలిచింది. అలాగే 1986లో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో డియెగో మారడోనా గోల్ చేసి ఇంగ్లండ్‌పై అర్జెంటీనాను గెలిపించాడు.

MetLife Stadium in New Jersey will host the 2026 World Cup final

కాగా, 2026 ప్రపంచకప్ ఫైనల్ జులై 19వ తేదీన జరగనుంది. ఈ తుది సమరానికి న్యూయార్క్‌లో ఈస్ట్ రూథర్‌ఫోర్డ్‌లో మెట్‌లైఫ్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మూడో స్థానం కోసం జరిగే పోరు మయామిలో జరగనుంది. ఈ మెగాటోర్నీ మొత్తం 39 రోజుల పాటు కొనసాగనుంది.

జూన్ 12న టొరంటోలో కెనడా తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. అదే రోజు యూఎస్‌ఏ కూడా తమ మొదటి మ్యాచ్‌ను ఆడనుంది. అయితే లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా అమెరికా తలపడనుంది. ఇక మెక్సికోలో మోంటెర్రే, గ్వాడలజారాతో సహా మొత్తం 16 నగరాలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

మరోవైపు అమెరికాలో అట్లాంటా, బోస్టన్, డల్లాస్, హ్యూస్టన్, కాన్సాస్ సిటీ, ఫిలడెల్ఫియా, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్ నగరాలు కూడా మెగా సమరానికి వేదికలుగా ముస్తాబవుతున్నాయి. కెనడాలోని వాంకోవర్ కూడా ఆతిథ్యం ఇవ్వనుంది.

1986లో ఫ్రాన్స్ నిర్వహించినట్లుగానే 2014, 2018లో 32 రోజుల పాటు టోర్నీ సాగింది. కానీ 2026 ప్రపంచకప్ సుదీర్ఘకాలం కొనసాగుతుందని గతంలోనే ఫిఫా ప్రకటించింది. ఈ సారి జరగనున్న మెగాటోర్నీలో 48 జట్లు పాల్గొనున్నాయి. 12 గ్రూప్‌లుగా విడిపోయి తలపడనున్నాయి. ఈ కొత్త ఫార్మాట్‌లో 104 మ్యాచ్‌లు జరగనున్నాయి.

కాగా, ఆ 12 గ్రూప్‌లలో టాప్-2లో నిలిచిన జట్లు తర్వాత రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. అక్కడ ఉత్తమ ఎనిమిది జట్లతో కలిసి రౌండ్-32లో తలపడతాయి. అయితే 48 జట్లను 16 గ్రూప్‌లుగా విభజించాలని తొలుత భావించారు. కానీ 12 గ్రూప్‌లుగా చేయడమే ఉత్తమంగా నిర్ణయించారు. ఖతార్‌లో జరిగిన 2022 ప్రపంచకప్‌లో 32 జట్లు తలపడిన విషయం తెలిసిందే.

Story first published: Monday, February 5, 2024, 16:52 [IST]
Other articles published on Feb 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+