Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరిగి 17 మంది మృతి

హైదరాబాద్: అంగోలాలోని ఓ పుట్‌బాల్ స్టేడియంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉత్తర అంగోలాలో ఒక స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 17 మంది పుట్‌బాల్ అభిమానులు మరణించగా, వందల మంది గాయపడ్డారు. వీరితో కొంతమంది పరిస్థితి విషయంగా ఉందని పోలీసులు వెల్లడించారు.

అంగోలాలోని యుజీ పట్టణంలో ఓ దేశీయ లీగ్‌ మ్యాచ్ సందర్భంగా కేవలం ఏడు నిమిషాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట కారణంగా ఈ పెను విషాదం చోటు చేసుకుంది. అంగోలా దేశీయ లీగ్ సీజన్‌లో శాంతా రీటా డి కాసియా, రిక్రేయేటివో డి లిబోలో మధ్య జరుగుతున్న మ్యాచ్‌ సందర‍్భంగా ప్రేక్షకులు ఒక్కసారిగా స్టేడియానికి పోటెత్తారు.

మెయిన్ గేట్ వద్ద తోపులాట

మెయిన్ గేట్ వద్ద తోపులాట

దీంతో స్టేడియంలోని జనవరి 4 స్టేడియం మెయిన్ గేట్ వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో 17 మంది చనిపోయారని, 56 మంది తీవ్ర గాయాలు పాలయ్యారని పోలీసు ప్రతినిధి ఓర్లాండో బెర్నార్డో చెప్పారు. చనిపోయిన వారిలో పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదని తెలిపారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు ఆయన చెప్పారు.

అంగోలా చరిత్రలోనే ఇది తీరని విషాదం

అంగోలా చరిత్రలోనే ఇది తీరని విషాదం

అంగోలా పుట్‌బాల్ చరిత్రలోనే ఇది తీరని విషాదమని అధికారులు వెల్లడించారు. ఈ ఘటపై అంగోలా అధ్యక్షుడు జోస్ ఎడ్వర్డో డాస్ శాంటోస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. గాయపడిన సాయం అందించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం

దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం

ఈ ఘటనపై దర్యాప్తుకు కూడా ఆదేశించామని అన్నారు. ప్రస్తుతం ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అంగోలా 148వ ర్యాంకులో ఉంది. ఇదిలా ఉంటే, పుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరిగి ఇంత పెద్ద మొత్తంలో ప్రాణాలు విడవడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు

గతంలో కూడా ఇలాంటి ఘటనలు

2010 ప్రపంచ కప్ ముందు ఆతిథ్య ఐవరీ కోస్ట్, మాలావి మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అత్యధికంగా అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. విపరీతమైన రద్దీ కారణంగా జరిగిన ఈ తొక్కిసలాటలో 19 మంది మృతి చెందారు. 2001లో ఘనాలో అక్ర స్పోర్ట్స్‌ స్టేడియంలో జరిగిన దుర్ఘటనలో 127మంది మరణించారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+