For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డెన్ బూటు రేసులో రూనీ, రొనాల్డొ, మెస్సీ, క్లోజ్

By Santaram
Wayne Rooney
క్రికెట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాంటిదే ఫుట్ బాల్ లో గోల్డెన్ బూట్. ఈసారి గోల్డెన్‌ బూటు రేసు ఫేవరెట్‌లు డజనుకుపైగానే ఉన్నారు. గత ప్రపంచకప్‌లో ఏడు గోల్స్‌తో బంగారు బూటు ఎగేరేసుకుపోయిన జర్మన్‌ స్త్ట్రెకర్‌ మిరస్లోవ్‌ క్లోజ్‌ మళ్లీ పోటీలో నిలిచాడు. రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కుర్రాళ్ల నుంచి గట్టిపోటీ ఎదురవుతున్న నేపథ్యంలో క్లోజ్‌ మళ్లీ సాధిస్తే అద్భుతమే! వేన్‌ రూనీ (ఇంగ్లాండ్‌), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌), లియోనల్‌ మెస్సి (అర్జెంటీనా) మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

స్పెయిన్‌కు 2008 యూరో ఛాంపియన్‌షిప్‌ అందించడంలో కీలకపాత్ర పోషించిన డేవిడ్‌ విల్లా, ఫెర్నాండో టోరెస్‌, బ్రెజిల్‌ నుంచి కాకా, లూయిస్‌ ఫాబియానో, రాబిన్హో..ఐవరీ కోస్ట్‌ కెప్టెన్‌ ద్రోగ్బా, కామెరూన్‌ కెప్టెన్‌ సామ్యూల్‌ ఎటో, రాబిన్‌ వాన్‌ పెర్సీ, విలియమ్‌ గల్లాస్‌ (ఫ్రాన్స్‌) కూడా బంగారు బూటు కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. పెద్దగా పేరు లేకున్నా స్టార్లకు పోటీగా చాలామంది ఆటగాళ్లే సిద్ధమయ్యారు. ఇంతమందిని ఊరిస్తున్న గోల్డెన్‌ బూట్‌ ఎవరిని వరిస్తుందో చూడాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.

1930 ప్రపంచకప్‌లో గోల్డెన్‌ బూట్‌ అవార్డును ప్రవేశపెట్టారు. టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడికి ఈ అవార్డు దక్కుతుంది. 1962 ప్రపంచకప్‌లో అత్యధికంగా ఆరుగురు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఐతే 1994లో ఒక్కరికే బంగారు బూటు దక్కేలా నిబంధనల్లో మార్చారు. ఒకరికంటే ఎక్కువగా అత్యధిక గోల్స్‌ చేసివుంటే..టైబ్రేకర్‌ ద్వారా నిపుణులు విజేతను ఎంపికచేస్తారు.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+