Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐలీగ్: చర్చిల్‌ బ్రదర్స్‌పై మొహున్‌బగన్ గెలుపు

బరాసత్: మాజీ చాంపియన్లు మొహున్ బగన్ జట్టు శుభారంభాన్ని అందుకున్నది. ఐ లీగ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో చర్చిల్‌బ్రదర్స్‌పై 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. కేవలం 10 మంది ఆటగాళ్లతోనే మొహున్‌బగన్ జట్టు గెలుపొందింది. కొన్నిసార్లు కుర్రాళ్లు అన్యమనస్కంగా వ్యవహరించినా మొహున్‌బగాన్ జట్టుకు 'లక్కీ చార్మ్‌'గా బల్వంత్ సింగ్ రూపంలో అద్రుష్టం కలిసొచ్చింది.

28వ నిమిషంలో చేసిన గోల్ గోవా జట్టు చర్చిల్ బ్రదర్స్‌పై విజయానికి దారి తీసింది. తొమ్మిది నెలల గడువు తర్వాత పూర్తిగా ఫిట్‌తో బరిలోకి దిగిన బల్వంత్.. ప్రీతం కోటల్ ప్రతిష్టాత్మకంగా క్రాస్ చేసిన బంతిని గోల్ పోస్ట్ బాట పట్టించాడు. సెకండాఫ్‌లో 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి వచ్చినా.. చివరి క్షణం వరకు కొన్ని ఫ్రీ కిక్స్ వచ్చినా మొహున్ బగన్ జట్టు మూడు పాయింట్లు పొందేందుకు బల్వంత్ కారణమయ్యాడు.

మాజీ చాంపియన్లు 64వ నిమిషంలో సెరిటాన్ ఫెర్నాండెజ్‌పై పౌల్ చేయడంతో సుభాషిష్ బోస్‌కు రెండోసారి ఎల్లోకార్డు చూపడంతో జట్టు 10 మంది ప్లేయర్లతోనే ఆట ముగించారు. 55వ నిమిషంలో టచ్‌లైన్ వద్ద చర్చిల్ బ్రదర్స్ సారథి కీనన్ అల్మైదాను తాకినందుకు సుభాషిష్ బోస్‌ను రిఫరీ తొలిసారి హెచ్చరించాడు.

10-men Mohun Bagan pip Churchill Brothers

70వ నిమిషంలో చర్చిల్ బ్రదర్స్ గోల్ సాధించి మ్యాచ్ డ్రా గా ముగించేందుకు అవకాశమొచ్చింది. ప్రబీర్ దాస్ పాస్ చేసిన బంతిని సెరిటాన్ గోల్ పోస్టు వైపు పంపినా దేబ్జిత్ మజుందార్ బార్ వద్ద నుంచి తిరగొట్టాడు. మ్యాచ్ పూర్తి సమయం దాటిన తర్వాత అంజెలో కొలాకో ఫ్రీ కిక్ రూపంలో పంపిన బంతి లక్ష్యాన్ని చేరుకోవడంలో మిస్సయింది. మరో నిమిషం తర్వాత అంజెలో కొలాకో పంపిన షాట్ గోల్ పోస్ట్ వద్ద మిస్సవ్వడంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం లేకుండా పోయింది. 2012 - 13 చాంపియన్లుగా చర్చిల్ బ్రదర్స్ నాలుగేళ్ల తర్వాత టాప్ డివిజన్ స్థానంలోకి చేరుకోవాలని తహతహలాడుతున్నది.

చెన్నై సిటీ, మినర్వ పంజాబ్ జట్ల మ్యాచ్ డ్రా

న్యూఢిల్లీ: ఐ లీగ్‌లో అడుగు పెట్టిన చెన్నై సిటీ ఎఫ్ సి, మినర్వ పంజాబ్ ఎఫ్ సి జట్ల మధ్య న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్ గోల్స్ లేకుండా డ్రా గా ముగిసింది. 4 - 5 -1 ఫార్మాట్‌తో బరిలోకి దిగిన చెన్నై సిటీ జట్టులో దేబబ్రత రాయ్, జోసెఫ్ క్లెమెంటే ఫుల్ బ్యాక్ ప్లేయర్లుగా, ధర్మరాజ్ రావణన్, అనియేచ్ ఎచెజొనా సెంట్రల్ డిఫెండర్లుగా తమ వ్యూహాలకు పనిపెట్టారు. ఐదో నిమిషంలో చెన్నై సిటీ ప్లేయర్ చార్సెస్ పంపిన బంతి స్క్వైర్ పాస్ గా దూసుకెళ్లింది.

తర్వాత మరో ఐదు నిమిషాలకు లాల్నన్ మావియా పంపిన ఫ్రీ హెడ్డర్ బంతిని మినర్వా గోల్ కీపర్ రవి కుమార్ నిలువరించాడు. మినర్వా పంజాబ్ జట్టు మనన్ దీప్ అవకాశం నెలకొల్పినా కరంజిత్ నిలువరించాడు. 34వ నిమిషంలోనూ మినర్వా పంజాబ్ మరో పాయింట్ పొందే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెకండాఫ్‌లో మినర్వా ఇద్దరు ప్లేయర్లను మార్చింది.

47వ నిమిషంలో అమిరికి అత్యంత దగ్గరకు వెళ్లిన చార్లెస్ గోల్ చేసే అవకాశం రెండోసారి మిస్సయ్యాడు. 60వ నిమిషంలోనూ చెన్నైని మినర్వా డిఫెండర్లు అడ్డుకోవడంతో గోల్స్ కాకుండానే ముగిసింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+