For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పిక్ వైరల్: ఇషాంత్ శర్మ అయితే జాట్లాన్ అంటాడేంటి!: రోహిత్‌కు మతి పోయిందా?

Rohit Sharma Comes Up With Cheeky Throwback Photo || Oneindia Telugu
Zlatan or Ishant: Rohit Sharma comes up with cheeky throwback photo

హైదరాబాద్: టెస్టుల్లో ఓపెనర్‌గా విజయవంతమవ్వడంతో బంగ్లాదేశ్‌తో టీ20 సిరిస్‌కు ముందు రోహిత్ శర్మ చాలా ఉత్సాహాంగా కనిపిస్తున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది.

పనిభారం కారణంగా ఈ సిరిస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో బంగ్లాతో టీ20 సిరిస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోహిత్ శర్మ తన ఇనిస్టాగ్రామ్‌లో ఓ పాత ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు.

ఈ ఫోటోకు రోహిత్ శర్మ "మాతో పాటు జాట్లాన్ ఉన్నాడు. అతడితో ఛాటింగ్ చేయడం చాలా సరదాగా అనిపించింది" అంటూ కామెంట్ పెట్టాడు. రోహిత్ శర్మ పోస్టు చేసిన ఫోటోలో అతడితో పాటు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మలు ఉన్నారు. అయితే, రోహిత్ మాత్రం జాట్లాన్ అని ట్వీట్ చేశాడు.

జాట్లాన్ ఎవరో కాదు. మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ స్టార్ పుట్ బాల్ ప్లేయర్. జాట్లాన్ అనగానే సాకర్ అభిమానులకు ఠక్కున గుర్తుకు వచ్చేది అతడి పోనీటైల్. అయితే, రోహిత్ శర్మ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలో ఇషాంత్ శర్మ అతడిలాగే పోనీటైల్‌తో ఉండటంతో జాట్లాన్ అని సంబోధించాడు.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే, తొలి టీ20పై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించవద్దని పర్యావరణవేత్తలు హెచ్చరించినప్పటికీ బీసీసీఐ ఎందుకు పట్టుదలకు పోతుందో అర్ధం కావడం లేదని వాపోతున్నారు.

దీంతో వాతావరణ కాలుష్యం కారణంగా తొలి టీ20లో ఇరు జట్ల క్రికెటర్లు వాయు కాలుష్యం బారిన పడి ఏమైనా సమస్యలకు లోనైతే ఏమి చేయాలని డీడీసీఏ కలవరపడుతోంది. శుక్రవారం ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా తగ్గింది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 357గా నమోదైంది. అయితే, శుక్రవారానికి గాలి నాణ్యత సూచిక 400 దాటింది.

దీంతో ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. నిజానికి గాలి నాణ్యత సూచిక 400 దాటితే తీవ్ర శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రజలను అవరసమైతే తప్పితే బయటకు వెళ్లవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో క్రికెటర్లు ఎలా ఆడతారనే సందేహాలు నెలకొన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో!

Story first published: Friday, November 1, 2019, 16:18 [IST]
Other articles published on Nov 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+