
పాపాకు పెద్ద అభిమాని:
తాజాగా సాక్షి ధోనీ షేర్ చేసిన వీడియో ఒకటి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియోలో ఏముందంటే.. జీవా తన తండ్రి ధోనీకి సంబంధించిన ఫొటోను చేతిలో పట్టుకుని ఉంది. ఆ ఫొటోలో ఉన్నది ఎవరు? అని సాక్షి అడగ్గా.. పాపా అని సమాధానం ఇచ్చింది. నిజంగా నాన్నేనా అని అడగ్గా.. 'ఎంఎస్ ధోనీ' అని చెప్పింది. నిజమేనా అని మరలా ప్రశ్నించగా.. 'హా నిజమే' అని జీవా బదులిచ్చింది. వీడియోను పోస్టు చేసిన సాక్షి 'పాపాకు పెద్ద అభిమాని' అన్న కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కూతురితో బైక్ రైడ్:
ఇంతకుముందు ఇదే ఇన్‌స్టాగ్రామ్‌లో జీవాకు సంబంధించిన రెండు వీడియోలను పోస్ట్ చేశారు. వాటిలో ఆకుపచ్చ రంగులో ఉన్న కమెలియన్ (తొండ)తో మాట్లాడుతూ సందడి చేసింది. దానికి 'ఎన్‌కౌంటర్ విత్ కమెలియన్.. బల్లుల దినోత్సవ శుభాకాంక్షలు' అనే ట్యాగ్ జతచేశారు. ఇక జూన్ నెలలో ధోనీ తనఫామ్ హౌస్‌లో కూతురితో బైక్ రైడ్ కలిసి చేస్తున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్ చేసింది. సాక్షి మాత్రమే కాకుండా సీఎస్‌కే కూడా జీవా వీడియోలను తన అధికారిక ట్విటర్ ఖాతాలలో పంచుకుంటుంది.
చెన్నైకి సారథిగా:
గత నెల 15న ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ కెరీర్‌లో మహీ 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 190 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథిగా ఉన్న ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 13వ సీజన్ కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ నెల 19న అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మెగా టోర్నీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications












