Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాయుడికి ఛాన్స్: కోహ్లితో పాటు సీనియర్లకు విశ్రాంతి

ముంబై: వచ్చే నెలలో జింబాబ్యేలో జరగనున్న వన్డే, టీ20 టోర్నమెంట్‌కు సోమవారం బీసీసీఐ జట్టును ప్రకటించింది. జింబాబ్వే పర్యటనకు కెప్టెన్‌గా ధోని నాయకత్వం వహిస్తుండగా టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, అశ్విన్, రహానేలకు విశ్రాంతినిచ్చారు.

చాలా రోజుల తర్వాత మళ్లీ జట్టులోకి తెలుగు తేజం అంబటి రాయుడికి చోటు కల్పించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సత్తా చాటుతున్న లెగ్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్‌తో పాటు కరుణ్ నాయర్‌ లాంటి యువ ఆటగాళ్లకు సిరిస్‌లో చోటు కల్పించారు. జూన్‌లో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీమిండియా మూడు వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.

MS DHONI

జింబాబ్వే పర్యటనలో భారత జట్టు:

ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, ఫైజ్ ఫైసల్, మనీష్ పాండే, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, రిషి ధావన్, అక్షర పటేల్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి, బుమ్రా, బరిందర్ శ్రాన్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్, జయదేవ్, యుజువేంద్ర చాహాల్

మరోవైపు జులై, ఆగస్టులో వెస్టిండిస్‌లో జరగనున్న టెస్ట్ సిరిస్‌కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరిస్‌లో భారత జట్టు 4 మ్యాచ్‌లు ఆడనుంది. వెస్టిండిస్‌తో జరిగే టెస్టు సిరిస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తుండగా, వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అజ్యంకే రహానే‌కు బీసీసీఐ అప్పగించింది.

వెస్టిండిస్ పర్యటనకు భారత జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్-కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, చెతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షామీ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, శ్రాద్ధూల్ ఠాకూర్, స్టువర్ట్ బిన్నీ.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+