
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా అడిలైడ్ లో జింబాబ్వే, నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. జింబాబ్వే ఆటగాళ్లలో సికిందర్ రజా టాప్ స్కోర్ గా ఉన్నాడు. రజా 24 బంతుల్లో మూడు సిక్స్ లు, మూడు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. సీన్ విలయమ్సన్ 23 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. మాధేవెరే 1, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 3, వికెట్ కీపర్ చకబ్వా 5, మిల్టన్ షుంబా 2, ర్యాన్ బర్ల్ 2, ఎల్ జోంగ్వే 6, నగరవ 9, చతారా 6, ముజరబానీ 1 పరుగు చేశారు.
వాన్ మీకెరెన్ 3
నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్ 3 వికెట్లు తీయగా.. బ్రాండన్ గ్లోవర్, బాస్ డి లీడే రెండేసీ 2 వికెట్లు పడగొట్టారు. ఫ్రెడ్ క్లాసెన్ ఒక వికెట్ తీశాడు. కాగా గ్రూప్-2లో నెదర్లాండ్స్ ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. జింబాబ్వేతో పాటు నెదర్లాండ్స్ కూడా సెమీస్ రేస్ నుంచి దాదాపుగా తెప్పుకున్నట్లే.. గ్రూప్-2లో సౌతాఫ్రికా 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
గెలిస్తే సెమీస్ కే
ఇండియా 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ కూడా 4 పాయింట్లతో మూడు స్థానంలో ఉంది. బుధవారం ఇండియా, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సెమీస్ వెళ్లడం లాంఛనమే.. ఇక పాకిస్థాన్ ఫైనల్ కు వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలువాలి. సౌతాఫ్రికా మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఓడాలి.