Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెనడాను చిత్తు చేసిన జింబాబ్వే, 175 పరుగులతో విజయఢంకా

Zimbabwe-Canada
నాగ్‌పూర్‌: గ్రూప్ ఎలో సోమవారం జరిగిన మ్యాచులో జింబాబ్వే కెనడాను చిత్తు చేసింది. కెనడాపై జింబాబ్వే 175 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 299 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన కెనడా 42.1 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ డేవిసన్‌ పరుగులేమీ చేయకుండా ప్రైస్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కుమార్‌ 1 పరుగు చేసి ప్రైస్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. కెనడా ఏడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బగాయ్‌ పరుగులేమీ చేయకుండా ప్రైస్‌ బౌలింగ్‌లో విలియమ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. గుణశేకర(24) లాంబ బౌల్డ్‌ చేశాడు. హన్సారా 20 పరుగులకు వుత్సేయ బౌలింగ్‌లో స్టంపవుట్‌ అయ్యాడు.

చీమా 14 పరుగులకు వుత్సేయ బౌలింగ్‌లో క్రీమర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. గోర్డన్‌ క్రీమర్‌ బౌలింగ్‌లో 7 పరుగులకు అవుటయ్యాడు. చౌహాన్‌ 8 పరుగులకు క్రీమర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సుర్కారీ 26 పరుగులకు లాంబ్‌ బౌలింగ్‌లో స్టంపవుట్‌ అయ్యాడు. బాలాజీ రావు ఒక పరుగుకు క్రీమర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. బైద్వాన్‌ 13 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. గుణశేకర, హన్సారా నాలుగో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి ఒకేసారి అవుటయ్యారు. ఆ తరువాత ఎవరూ మంచి భాగస్వామ్యాలు నమోదు చేయలేదు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన జింబాబ్వే ఆట ప్రారంభంలోనే త్వరత్వరగా రెండు వికెట్లను కోల్పోయింది. అయితే బ్యాటింగ్‌కు వచ్చిన తైబు, ఎర్విన్‌ల నిలకడగా ఆడి మూడో వికెట్‌కు 181 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. మొదటి పవర్‌ ప్లేలో జింబాబ్వే 44 పరుగులు చేసింది. 2 వికెట్లు కోల్పోయింది. రెండో పవర్‌ ప్లే 11-15)తీసుకున్న కెనడా 29 రన్స్‌ ఇచ్చింది. వికెట్లేమీ తీసుకోలేదు. జింబాబ్వే 65 బంతుల్లో 50, 118 బంతుల్లో 100, 151 బంతుల్లో 150, 201 బంతుల్లో 200, 262 బంతుల్లో 250 పరుగులు చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు, 24 ఫోర్లు ఉన్నాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+