Sanjay Manjrekar : ఈ సిరీస్ దీపక్ చాహర్‌కు గట్టి పరీక్ష.. అతని వల్లే టీ20 వరల్డ్‌కప్‌కు చాహర్ మిస్..!

ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్ దీపక్ చాహర్‌కు పరీక్షా వేదిక అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ కోసం కోసం దీపక్ చాహర్ తిరిగి జట్టులో అడుగుపెట్టాడు. సుదీర్ఘ విరామం తర్వాత అతను జాతీయ జట్టులో ఆడుతున్నాడు. గాయం వల్ల ఈ సంవత్సరం ఐపీఎల్ మొత్తానికి దూరమైన మంజ్రేకర్.. తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలకు దూరమయ్యాడు. స్పోర్ట్స్ 18తో అతను ప్రత్యేకంగా మాట్లాడాడు. 'స్పోర్ట్స్ ఓవర్ ది టాప్' షోలో మంజ్రేకర్ మాట్లాడుతూ.. ఈ సిరీస్ చాహర్‌కు టెస్ట్ గ్రౌండ్‌గా నిలుస్తుందని చెప్పాడు.
దీపక్ చాహర్‌ను 'నేటి భువనేశ్వర్ కుమార్' అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చాహర్‌ను ప్రపంచకప్ జట్టులోకి తీసుకోకపోతే అందుకు గల ఏకైక కారణం అతను సేమ్ భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలింగ్ కలిగి ఉండడమే అని మంజ్రేకర్ చెప్పాడు. 'దీపక్ చాహర్ ఫిట్‌నెస్ పరీక్షించేందుకు అతన్ని జింబాబ్వే పర్యటనలో ఆడిస్తున్నారని నేను భావిస్తున్నాను. అతను వన్డే సిరీస్లో సంచలనాత్మకంగా బౌలింగ్ చేయగలిగితే అతను టీ20 ప్రపంచకప్ టోర్నీకి కూడా ఎంపికవుతాడనేది నా ఉద్దేశ్యం. దీపక్ చాహర్ బౌలింగ్లో మంచి గణాంకాలున్నాయి. టీ20 క్రికెట్‌లో పేరెన్నదగ్గ ప్లేయర్ అతను. అతను ఇండియాకు వర్ధమాన భువనేశ్వర్ కుమార్. భువీలాగే అతను బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగలడు. డెత్‌లో బౌలింగ్ విషయంలో కాస్త మెరుగుపడాలి కానీ.. అతను ఆ విషయంలోనూ చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు' అని మంజ్రేకర్ తెలిపాడు.
'దీపక్ చాహర్ టీ20 ప్రపంచకప్ జట్టులోకి రాకుండా నిరోధించే ఏకైక విషయం ఏంటంటే అతను భువనేశ్వర్ కుమార్‌తో సమానంగా బౌలింగ్ చేయగలగడమే. ప్రస్తుతం భువీ అత్యుత్తమ ఫాంలో ఉన్నాడు. అందువల్ల అతన్నేకొనసాగించాడానికి వీలుంటుంది. దీపక్ చాహర్ కూడా ఎంట్రీ ఇవ్వాలంటే.. అతను జింబాబ్వే సిరీస్లో ఏదైనా సంచలనం సృష్టించాలి' అని మంజ్రేకర్ అన్నాడు. ఇకపోతే తొలి వన్డేలో మొదటి ఏడు ఓవర్లలో కేవలం 27పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన చాహర్ జట్టులోకి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications