
జింబాబ్వే దెబ్బకు..
అక్కడితోనే వాటికి బ్రేక్ పడలేదు. పాకిస్తాన్ సైతం ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. జింబాబ్వే చేతిలో మట్టి కరిచింది. ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దాన్ని ఛేదించలేక చతికిల పడింది పాకిస్తాన్. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా రెండింటితోనే సరిపెట్టుకుంది. ఆల్‌రౌండర్ సికిందర్ రజా పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

అసలు హీరో అతనే..
ఈ మ్యాచ్‌లో అసలు సిసలు హీరో సికందర్ రజా. నిఖార్సయిన ఆల్‌రౌండర్. తన బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో జట్టును గెలిపించిన క్రికెటర్. వామప్స్‌లల్లో దుమ్ము దులిపాడు. తొలి వామప్‌లో ఐర్లాండ్‌పై 48 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఒక వికెట్ తీసుకున్నాడు. స్కాట్లాండ్‌పైనా 40 పరుగులు చేశాడు. ఓ వికెట్ పడగొట్టాడు. వెస్టిండీస్‌పై బ్యాటర్‌గా విఫలమైనప్పటికీ.. బౌలర్‌గా సత్తా చాటాడు. మూడు వికెట్లు పడగొట్టాడు.

అదే దూకుడును సూపర్ 12లోనూ
అదే దూకుడును సికందర్ రజా సూపర్ 12లో కూడా కొనసాగిస్తోన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్- అతనికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అదే సమయంలో వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడం కలిసొచ్చింది. ఇక పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌గా విఫలం అయ్యాడు సికందర్ రజా. 14 పరుగులు మాత్రమే చేశాడు గానీ.. ఆ తరువాత బౌలర్ మాత్రం చిరస్మరణీయమైన ఇన్నింగ్ ఆడాడు.

మూడు వికెట్లు..
తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. షాన్ మసూద్, షాదబ్ ఖాన్, హైదర్ అలీ వికెట్లను పడగొట్టాడు. ఈ మూడూ కీలకమైనవే. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు క్రీజ్‌లో కుదురుకున్నా ఫలితం మరోలా ఉండేది. అప్పటికే పాతుకుపోయిన షాన్ మసూద్‌ను సికందర్ రజా పెవిలియన్ దారి పట్టించాడు. 38 బంతుల్లో 44 పరుగులు చేసిన షాన్ మసూద్.. సికందర్ రజా బౌలింగ్‌లో ఫ్రంట్ ఫుట్ ఆడబోయి మిస్ అయ్యాడు. స్టంపౌట్ అయ్యాడు.

కోహ్లీ రికార్డులు బద్దలు..
ఇప్పుడిక తాజాగా సికందర్ రాజా మరో ఘనతను సాధించాడు. టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డులను అధిగమించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లల్లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న రికార్డును అధిగమించాడు. 2016 ఎడిషన్‌లో రెండుసార్లు కోహ్లీ ఈ అవార్డును అందుకోగా.. ఇప్పుడు సికందర్ రజా దాన్ని చెరిపేశాడు. మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

క్యాలెండర్ ఇయర్‌లోనూ..
అలాగే- ఓ టీ20 ఇంటర్నేషనల్స్ క్యాలెండర్ ఇయర్‌లోనూ విరాట్ కోహ్లీని డామినేట్ చేశాడు సికందర్ రజా. ఒక టీ20 ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఇయర్‌లో ఏడుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. అది కూడా ఈ సంవత్సరమే. ఇదివరకు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. 2016 టీ20 క్యాలెండర్ ఇయర్‌లో ఆరుసార్లు కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అది ఇప్పుడు చెరిగిపోయింది.


Click it and Unblock the Notifications
