For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

21 ఏళ్ల 96 రోజులు.. కోహ్లీ,సచిన్‌కే సాధ్యం కానీ రికార్డ్ ఇది

సచిన్ తెందుల్కర్, విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి తమ పేరిట లిఖించుకున్నారు. తమ కన్నా ముందు వచ్చిన దిగ్గజాల రికార్డులను కూడా బ్రేక్ చేసి మేటి క్రికెటర్లుగా ఎదిగారు. ఇంకా చెప్పాలంటే వరల్డ్ క్రికెట్ లో ఈ ఇద్దరు సాధించనివి ఘనతలు చాలా తక్కువగా ఉంటాయనే చెప్పాలి. అయితే తాజాగా ఓ యంగ్ క్రికెటర్.. సచిన్, కోహ్లీ సాధించలేని ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుని క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

అతడెవరంటే?
తాజాగా ఐర్లాండ్‌ - జింబాబ్వే మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే ప్లేయర్ బ్రియాన్‌ బెన్నెట్‌ ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. వన్డేల్లో అత్యంత పిన్న వయసులోనే 150కు పైగా స్కోర్‌ చేసిన క్రికెటర్ గా ఘనత సాధించాడు. 22 ఏళ్ల వయసు పూర్తిగా నిండకముందే (21 ఏళ్ల 96 రోజులు) ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Zimbabwe s Brian Bennett Achieves Rare ODI record That Kohli and Sachin Never Did

సచిన్, కోహ్లీకే కుదరలేదు..
దిగ్గజ క్రికెటర్లు అయిన సచిన్‌ తెందుల్కర్, విరాట్‌ కోహ్లీ ఈ ఘనతను ఇంత చిన్న వయసులో సాధించలేకపోయారు. సచిన్‌ కు 150 ప్లస్ స్కోరు చేయడానికి 26 ఏళ్ల 198 రోజుల వయసు సమయం పట్టగా.. కోహ్లీ 23 ఏళ్ల 134 రోజుల వయసులో ఈ ఘనతను అందుకున్నాడు.

నాలుగో ఆటగాడిగా రికార్డ్..
వన్డే క్రికెట్‌ లో బ్రియాన్‌ బెన్నెట్ కన్నా చిన్న వయసులోనే 150కు పైగా స్కోర్‌ చేసిన క్రికెటర్లు కేవలం ముగ్గురే ఉన్నారు. 2010లో ఐర్లాండ్‌ క్రికెటర్ పాల్‌ స్టిర్లింగ్‌ 20 ఏళ్ల 4 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ చేశాడు. దీంతో అత్యంత చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. 2009లో బంగ్లాదేశ్‌ బ్యాటర్ తమీమ్‌ ఇక్బాల్‌ 20 ఏళ్ల 149 రోజుల వయసులో ఈ రికార్డును అందుకున్నాడు. ఆఫ్ఘానిస్థాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్‌ 20 ఏళ్ల 353 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. తాజాగా బ్రియాన్‌ ఈ రికార్డ్ సాధించిన నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.

Story first published: Saturday, February 15, 2025, 7:31 [IST]
Other articles published on Feb 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+