5sixes, 1Four in Over: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. ర్యాన్ బర్ల్ విధ్వంసకాండ, ఓవర్లో 34రన్స్

హరారే స్పోర్స్ట్ క్లబ్ : జింబాబ్వే సంచలన ఆటతీరును కనబర్చింది. స్వదేశంలో జరిగిన టీ20సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను చావు దెబ్బ కొట్టింది. మూడో మ్యాచ్‌లో గెలిచి 2-1 తేడాతో సిరీస్ గెలుపొందింది. జింబాబ్వేతో పోల్చితే బంగ్లాదేశ్ చాలా గట్టి టీం. కానీ ఇటీవల టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఉత్సాహం, అలాగే మళ్లీ తమ మునుపటి క్రికెట్ వైభవాన్ని అందుకోవాలన్న కసి జింబాబ్వే జట్టులో కన్పించింది. ఇకపోతే మూడో టీ20లో మొదట జింబాబ్వే నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లకు 156 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసి 10పరుగులు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ర్యాన్ బర్ల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా, సికందర్ రాజా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్ట్ 5 నుంచి మొదలవుతుంది.
జింబాబ్వే బ్యాటర్ విధ్వంసకాండ
ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్ ర్యాన్ బర్ల్ విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతను (28 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 54పరుగులు) ఎడాపెడా బౌండరీలు బాదుతూ బంగ్లా బౌలర్లను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో మరో అద్భుత ఘనత కూడా అతను సాధించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బంగ్లా బౌలర్ నసుమ్ అహ్మద్ బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ ఓవర్లో ర్యాన్ (6, 6, 6, 6, 4, 6) బాదాడు. వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన బర్ల్ ఐదో బంతిని స్ట్రెయిట్ బౌండరీ తరలించాడు. ఆ తర్వాత చివరి బంతిని మరో సిక్స్‌గా మలిచాడు. మొత్తంగా ఐదు సిక్సర్లు, ఒక బౌండరీ కలిపి ఆ ఓవర్లో 34పరుగులొచ్చాయి. తద్వారా యువరాజ్, పొలార్డ్ తర్వాత ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు.
టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు, పరుగులు పిండుకున్న బ్యాటర్లు
36 పరుగులు : స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్
36 పరుగులు : ధనంజయ బౌలింగ్లో కీరన్ పొలార్డ్
34 పరుగులు : నసుమ్ అహ్మద్ బౌలింగ్లో రియాన్ బర్ల్ (జింబాబ్వే)
34 పరుగులు : ఎస్ డ్యూబ్ బౌలింగ్లో సీఫెర్ట్, ఆర్ టేలర్
33 పరుగులు : పెహులుక్వయో బౌలింగ్లో బెయిర్ స్టో, మొయిన్ అలీ
32 పరుగులు : పార్నెల్ బౌలింగ్లో బట్లర్
తుది జట్లు :
జింబాబ్వే (ప్లేయింగ్ XI): రెగిస్ చకబ్వా (వికెట్ కీపర్), క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), వెస్లీ మాధేవెరే, సికందర్ రజా, సీన్ విలియమ్స్, బ్రాడ్ ఎవాన్స్, మిల్టన్ శుంబా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, విక్టర్ న్యాచి, జాన్ మసారా
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), అనముల్ హక్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, అఫీఫ్ హొస్సేన్, మహ్మదుల్లా, నజ్ముల్ హొస్సేన్ శాంటో, మొసద్దెక్ హొస్సేన్(కెప్టెన్), మహేదీ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, నసుమ్ అహ్మద్, హసన్ మహ్మద్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications