బంగ్లాదేశ్‌కు షాకివ్వలే..! అట్టాగే టీమిండియాకు షాక్ ఇవ్వడం ఖాయం : జింబాబ్వే క్రికెటర్ అమాయక కాయ

యూఏఈలో జరిగే ఆసియా కప్‌కు ముందు భారత జట్టు జింబాబ్వే పర్యటనలో ఓ చిన్న పని చేసుకురావాల్సిన అవసరముంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు జింబాబ్వే జట్టుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 2016లో జింబాబ్వేలో భారత్ పర్యటించింది. సుమారు 6ఏళ్ల తర్వాత మళ్లీ జింబాబ్వేలో టీమిండియా అడుగుపెట్టింది. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ వైట్‌వాష్ చేసి టీ20 సిరీస్ 4-1 తేడాతో గెలిచిన ఇండియా.. జింబాబ్వే పర్యటనలో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఎలాగూ క్లీన్ స్వీప్ చేస్తుంది.
అద్బుతం జరిగితే తప్పా జింబాబ్వే గెలిచే అవకాశమే లేదు. అయితే జింబాబ్వే బ్యాటర్ అయిన ఇన్నోసెంట్ కాయ టీమిండియాకు షాక్ తగలడం ఖాయమన్నాడు. భారత్ మా చేతిలో పెద్ద పరాజయాన్ని చవిచూస్తుందని ఇన్నోసెంట్‌గా చెప్పాడు. పేరులో ఉన్న ఇన్నోసెంట్.. అతని మాటల్లోనూ కన్పించింది.

మాదే పైచేయి అంటున్న ఇన్నోసెంట్
ఇండియా జింబాబ్వేలో 1992లో తొలిసారి పర్యటించింది. అప్పటినుంచి 13సార్లు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. 2001 నుంచి భారత్ జింబాబ్వేపై ఓటమి ఎరుగలేదు. 2013, 2015, 2016లలో మూడు బ్యాక్-టు-బ్యాక్ వన్డే సిరీస్‌లను వైట్‌వాష్ చేసింది. రెండు టీ20 సిరీస్‌లు గెలిచింది. అలాగే ఓ టెస్టు కూడా గెలిచింది. గత 21ఏళ్లలో ఇండియా చేతిలో దారుణ పరాజయాలు జింబాబ్వే జట్టు మూటగట్టుకున్నపపటికీ.. అమాయకపు కాయ మాత్రం ఇండియా మీద తమదే పైచేయి అంటూ ప్రగల్భాలు పలికాడు.

నేనే హయ్యెస్ట్ రన్ స్కోరర్ అవుతాను
ఇన్నోసెంట్ కాయ టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జింబాబ్వే ఇండియాపై 2-1 తేడాతో వన్డే సిరీస్ విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పాడు. ఈ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా తానే నిలుస్తానని, సెంచరీలు కూడా కొడతానని చెప్పుకొచ్చాడు. ‘ఈ సిరీస్లో మా జట్టు ఇండియాపై 2-1 తేడాతో గెలుస్తుంది. వ్యక్తిగత ప్రదర్శనల విషయానికొస్తే.. నేను లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉంటాను. అలాగే సెంచరీలు కూడా చేయాలనుకుంటున్నాను. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలవాలంటే నేను ఎక్కువ రన్స్ చేయడం మీద ఫోకస్ పెట్టాలి. అదే లక్ష్యం. ఇటీవల మేం బంగ్లాదేశ్ మీద కూడా గెలిచాం. అదే ఉత్సాహాన్ని ఇండియాపై ప్రదర్శిస్తాం' అని కాయ అన్నాడు.


మాకో కోచ్ వచ్చాడు.. అన్నీ మార్చేశాడు
ఇకపోతే ఇటీవల బంగ్లాదేశ్‌పై టీ20లు, వన్డే సిరీస్‌లను జింబాబ్వే గెలిచిన సంగతి తెలిసిందే. 2015లో జరిగిన వన్డే సిరీస్లలో ఐర్లాండ్‌పై 2-1 తేడాతో విజయం సాధించిన తర్వాత జింబాబ్వే తొలిసారి బంగ్లాదేశ్ లాంటి టాప్ దేశంపై తొలిసారి గెలిచింది.' మాకో కొత్త కోచ్ (డేవిడ్ ) వచ్చాడు. అతను మేం పాజిటివ్ క్రికెట్ ఆడాలని చెబుతున్నాడు. మేము అదే చేస్తున్నాము. మా షాట్లు ఆడటానికి మేము ఇక భయపడము. ఇప్పుడన్నీ మారిపోయాయి. జింబాబ్వే ఇప్పుడు చులకన చేసేంత చిన్న టీం ఏం కాదు పెద్దది' అని కాయ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications