Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Brendan Taylor: అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్!!

Zimbabwe Cricketer Brendan Taylor Announces Retirement From International Cricket

హరారే: జింబాబ్వే మాజీ కెప్టెన్‌, సీనియర్ క్రికెటర్ బ్రెండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా సోమవారం టేలర్ వెల్లడించాడు. ఐర్లాండ్‌తో సోమవారం (సెప్టెంబరు 13) జరిగే మూడో వన్డే తన చివరి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ అని పేర్కొన్నాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్.. కెరీర్‌లో 34 టెస్టులు, 204 వన్డేలు, 44 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. జింబాబ్వే క్రికెట్‌కి వన్నె తెచ్చిన ఆటగాడిగా గుర్తింపు పొందిన టేలర్.. ఆ జట్టు దిగ్గజాల్లో ఒకడిగా నిలిచాడు.

బ్రెండన్ టేలర్ ట్విటర్‌ వేదికగా ఓ భావోద్వేగ నోట్‌ షేర్‌ చేశాడు. 'నా ప్రియమైన దేశానికి సోమవారం నా చివరి ఆట ఆడనున్నాను. 17 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ఆట నాకు ఎన్నో నేర్పింది. నేను ఈ స్థితిలో ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నా. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వపడుతున్నా. మైదానంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. 2004లో అరంగేట్రం చేసిన నాటి నుంచి జట్టును మెరుగైన స్థితిలో ఉంచేందుకు నా వంతు కృషి చేశా. నాకు అండగా నిలిచిన నా కుటుంబానికి ధన్యవాదాలు. ముఖ్యంగా నా సతీమణి, నాలుగు పిల్లలకు. నా ఎదుగుదలకు తోడ్పడిన జింబాబ్వే క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌, కోచ్‌లు, అభిమానులు, సహచర ఆటగాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని టేలర్ పేర్కొన్నాడు.

Zimbabwe Cricketer Brendan Taylor Announces Retirement From International Cricket

బ్రెండన్ టేలర్ 18 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. జింబాబ్వే జట్టులోకి తొలుత బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన టేలర్.. ఆ తర్వాత ఆఫ్ స్పిన్నర్ కూడా రాణించాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా పడగొట్టాడు. మధ్యలో రెగ్యులర్ వికెట్ కీపర్ తతెంద తైబు జట్టుకి దూరమవగా.. కొన్నాళ్లపాటు కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. బ్రెండన్‌ టేలర్‌ 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 34 టెస్టులాడిన అతడు 2320 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన టేలర్‌.. 118.22 స్ట్రైక్‌రేటుతో 934 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ద శతకాలు ఉన్నాయి.

తనెంతగానో ఇష్టపడే వన్డే క్రికెట్‌లో 204 మ్యాచ్‌లు ఆడి 6677 పరుగులతో సత్తాచాటిన బ్రెండన్ టేలర్‌.. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు (11) చేసిన ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. అయితే 2004లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా.. 2009 వరకూ టేలర్ వన్డే సెంచరీ చేయలేకపోయాడు. 2009లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో 118 పరుగులు చేసినా.. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడిపోయింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, శ్రీలంకపై కూడా సెంచరీలు సాధించిన టేలర్.. మొత్తంగా వన్డేల్లో 11 శతకాలు నమోదు చేశాడు. 35 ఏళ్ల టేలర్‌ ప్రస్తుతం ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా మూడో వన్డే ఆడిన అనంతరం ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి నిష్క్రమించనున్నాడు.

Story first published: Monday, September 13, 2021, 15:36 [IST]
Other articles published on Sep 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+