చరిత్ర సృష్టించిన జింబాబ్వే: ఎనిమిదేళ్ల తర్వాత తొలి సిరిస్
హైదరాబాద్: జింబాబ్వే క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శ్రీలంకపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. సోమవారం హంబన్‌తోటలో జరిగిన ఐదో వన్డేలో 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఐదు వన్డేల సిరిస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
ఎనిమిదేళ్ల తర్వాత జింబాబ్వే విదేశీ గడ్డపై తన తొలి సిరిస్‌ను గెలిచింది. చివరిసారిగా 2009లో కెన్యాపై జింబాబ్వే వన్డే సిరిస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.
అనంతరం 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన 37.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చివర్లో సికందర్ రాజా కీలక ఇన్నింగ్స్ ఆడటంతో జింబాబ్వే అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్ దనంజయ ఆరు వికెట్లు తీసుకున్నాడు.
Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Zim beat SL to win historic ODI series
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications