
హైదరాబాద్: భారత్‌తో వరుస ఓటముల అనంతరం శ్రీలంక జట్టు తన అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకుని ఫెయిలైంది. అటుఇటుగా ఆడే జింబాబ్వే జట్టుతోనూ ఆడి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
భారత్‌తో సిరీస్‌ల అనంతరం లంక జట్టు జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతో ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు సన్నద్ధమైంది.
ఈ విషయంలో జింబాబ్వేకు ఇదొక ఓ అద్భుత విజయం. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 12 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.
మొదట మసకద్జ (73), సికిందర్ రజా (81 నాటౌట్) రాణించడంతో జింబాబ్వే 50 ఓవర్లలో 6 వికెట్లకు 290 పరుగులు చేసింది. ఛేదనలో లంక పోరాడినా.. 48.1 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది.
లంక బ్యాట్స్‌మెన్‌లు ఎంత శ్రమించినా టీంను గెలిపించలేకపోయారు. కుశాల్ పెరీరా (80), తిసార పెరీరా (64), మాథ్యూస్ (42) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. చటార (4/33) రాణించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.