T20 World Cup 2022: ఐర్లాండ్‍పై జింబాబ్వే గెలుపు.. రాణించిన రజా..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఐర్లాండ్ పై జింబాబ్వే 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. జింబాబ్బే ఆటగాళ్లలో రజా 48 బంతుల్లో 5 సిక్స్ లు,5 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. మిగతా వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 3 వికెట్లు తీయగా.. మార్క్ అదిర్, సిమి సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ముజారబానీని
175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసింది. ఐర్లాండ్ ఆటగాళ్లలో కర్టిస్ కాంఫర్ 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జింబాబ్బే బౌలర్లలో ముజారబానీని 3 వికెట్లు తీశాడు. టెండై చతర, రిచర్డ్ నగరవ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సికందర్ రజా, సీన్ విలియమ్స్ ఒక్కో వికెట్ తీశారు.
నాలుగు జట్లు
వరల్డ్ కప్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో టాప్ లో ఉన్న నాలుగు సూపర్ 12 దశకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ స్టేజీలో శ్రీలంక, వెస్టిండీస్ ఫేవరెట్లుగా ఉన్నాయి. పాయింట్ల పరంగా చూస్తే గ్రూప్ ఏలో నమీబియా, నెదర్లాండ్ అగ్రస్థానంలో ఉండగా.. గ్రూప్ బీలో జింబాబ్వే, స్కాట్లాండ్ అగ్రస్థానంలో ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications