Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆల్‌రౌండర్‌

Zimbabwe All-Rounder Solomon Mire Retires From All Forms Of Cricket || Oneindia Telugu
Zimbabwe all-rounder Solomon Mire retires from all forms of cricket

హరారే: జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సాలమన్‌ మైర్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ఎదుర్కొంటున్న పరిస్థితులలో రిటైర్మెంట్‌ దురదృష్టకరం. ఎంతో బాధగా ఉన్నా తన చేతుల్లో ఏమీ లేదని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

అత్యుత్తమ గౌరవంగా భావిస్తున్నా:

అత్యుత్తమ గౌరవంగా భావిస్తున్నా:

'అంతర్జాతీయ క్రికెట్‌ మండలిలో జింబాబ్వే క్రికెట్‌ సస్పెన్షన్‌కు గురైన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం బాధగా ఉంది. అయినా నా చేతుల్లో ఏమీ లేదు. జింబాబ్వే తరఫున క్రికెట్‌ ఆడటం అత్యుత్తమ గౌరవంగా భావిస్తున్నా. నాకు ఈ అవకాశం దక్కడం గర్వంగా ఉంది' అని సాలమన్‌ మైర్ పేర్కొన్నాడు.

ఎన్నో జ్ఞాపకాలు:

ఎన్నో జ్ఞాపకాలు:

'కెరీర్‌ రోలర్‌కోస్టర్‌లా ఎత్తుపల్లాలతో సాగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడటం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అదృష్టవంతుడిని. అతి తక్కువ సమయంలోనే ఎన్నో జ్ఞాపకాలను సొంతం చేసుకున్నా. ఎలాంటి సమయంలోనైనా తన వెన్నంటే ఉండి సహకారమందించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, స్పాన్సర్లకు ధన్యవాదాలు' అని మైర్ తెలిపాడు.

జీవితంలో క్రికెట్ పెద్ద పాఠం:

జీవితంలో క్రికెట్ పెద్ద పాఠం:

ముఖ్యంగా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. 'అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ప్రపంచం నలుమూలల నుండి అభిమానులు ఉన్నారని అనుకోవట్లేదు. చాలా మంది స్నేహితులు మరియు నేను ఎప్పటికీ కలవని వారికి ధన్యవాదాలు. నా జీవితంలో క్రికెట్ పెద్ద పాఠం అవుతుందని సందేహం లేకుండా చెప్పగలను. జీవితంలో మరో ముందడుగు వేయాలనుకుంటున్నా' అని సాలమన్‌ మైర్ అన్నారు.

ఒక్క శతకమే:

ఒక్క శతకమే:

29 ఏళ్ల మైర్ జింబాబ్వే తరఫున రెండు టెస్టులు, 47 వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఒక శతకం, ఐదు అర్ధ శతకాలు సాధించాడు. అంతేకాదు 14 వికెట్లు కూడా తీసాడు. మైర్ అత్యధిక స్కోరు 112. 2017లో శ్రీలంకపై చేసాడు. 317 పరుగుల లక్ష్య ఛేదనలో మైర్ సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

Story first published: Wednesday, July 24, 2019, 10:06 [IST]
Other articles published on Jul 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+