న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జీరో టాలరెన్స్ కేవలం నా మీదనేనా.. అక్మల్‌ నిషేధ కుదింపుపై కనేరియా ఫైర్!!

Zero tolerance policy only applies on me and not on others: Danish Kaneria lashes out at PCB

ఇస్లామాబాద్: నా ఒక్కడి విషయంలోనే జీరో టాలరెన్స్‌, ఇతరుల మీద కాదు కదా అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను ఆ దేశ వెటరన్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా ప్రశ్నించాడు. తాజాగా పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్‌మన్‌ ఉమర్ అక్మల్‌ విషయంలో పీసీబీ మూడేళ్ల నిషేధాన్ని 18 నెలలకు కుదించిన సంగతి తెలిసిందే. అక్మల్‌ తప్పు ఒప్పుకోవడంతో శిక్షను సగానికి తగ్గించింది. కనేరియా కూడా తన తప్పును ఒప్పుకున్నా.. పీసీబీ మాత్రం ఏమీ చేయకుండా ఉంది.

తండ్రైన హార్దిక్ పాండ్యా!!తండ్రైన హార్దిక్ పాండ్యా!!

నా ఒక్కడి విషయంలోనే జీరో టాలరెన్స్:

నా ఒక్కడి విషయంలోనే జీరో టాలరెన్స్:

ఉమర్‌ అక్మల్‌ విషయంలో పీసీబీ మూడేళ్ల నిషేధాన్ని 18 నెలలకు కుదించిన నేపథ్యంలో డానిష్‌ కనేరియా స్పందిస్తూ గురువారం ఓ ట్వీట్‌ చేశాడు. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఉద్దేశిస్తూ.. పీసీబీని ప్రశ్నించాడు. 'నా ఒక్కడి విషయంలోనే జీరో టాలరెన్స్‌, ఇతరుల మీద మాత్రం కాదు. జీవితకాల నిషేధం నా మీదే కానీ.. వేరేవాళ్లకు కాదు. కులం, మతం, వర్ణం, నేపథ్యం లాంటి విషయాలను బట్టి చట్టాలు అమలౌతాయా?. నేనొక హిందువును, ఈ విషయంలో గర్వంగా ఉన్నా' అంటూ‌ కనేరియా ట్వీట్‌ చేశాడు.

హిందువు అయినందున:

హిందువు అయినందున:

2012లో ఇంగ్లీష్‌ కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా.. డానిష్‌ కనేరియా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అతడిపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో కనేరియా అప్పటినుంచీ ఎలాంటి క్రికెట్‌ ఆడడం లేదు. 2018లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నేరాన్ని అంగీకరించాడు. అయినా పీసీబీ తనపై కనికరం చూపడం లేదంటూ ఇంతకుముందు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువు అయినందున పాక్‌ బోర్డు తన విషయంలో జోక్యం చేసుకోవట్లేదని బాహాటంగానే ఆరోపించాడు. ఈ విషయం అప్పుడు పెద్ద దుమారమే రేపింది.

జీవనోపాధి లేక ఇబ్బందులు:

జీవనోపాధి లేక ఇబ్బందులు:

ఆటకు దూరమైనప్పటి నుంచీ జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నానని, కుటుంబ పోషన కోసం మళ్లీ క్రికెట్‌ ఆడాలనుందని, పీసీబీ చొరవ తీసుకొని అవకాశం కల్పించాలని డానిష్‌ కనేరియా పలుమార్లు కోరాడు. ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని పీసీబీ స్పష్టం చేసింది. ఇంగ్లండ్ క్రికెట్‌ బోర్డే అతడికి శిక్ష విధించిందని, అక్కడే సంప్రదించాలని పీసీబీ ఇటీవల కనేరియాకు సూచించింది. దీంతో కనేరియాకు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాడు. మాజీ క్రికెటర్‌ అనిల్‌ దల్పత్‌ తర్వాత కనేరియానే పాక్‌ జట్టులో ఆడిన రెండో హిందూ ఆటగాడు. అంతర్జాతీయ కెరీర్‌లో కనేరియా 61 టెస్టుల్లో, 18 వన్డే మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

కౌంటీ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌:

కౌంటీ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌:

2000లో పాక్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్‌‌లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎలాంటి కారణం లేకుండానే పీసీబీ కనేరియాను జట్టు నుంచి తప్పించింది. జట్టులో చోటు కోసం చాలా రోజులు నిరీక్షించిన కనేరియా.. అవకాశం దక్కకపోవడంతో కౌంటీ క్రికెట్‌లో ఎస్సెక్స్ తరఫున ఆడటం మొదలు పెట్టాడు. ఇక 2009లో డర్హామ్‌పై ఎసెక్స్ తరఫున ఆడుతున్నప్పుడు సహచర ప్లేయర్ మెర్విన్ వెస్ట్‌ఫీల్డ్‌తో కలిసి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. వెస్ట్‌ఫీల్డ్‌ తనను ఓ వన్డే గేమ్‌లో 12 పరుగులు ఇవ్వాలని ఒప్పించాడని కనేరియా అంగీకరించాడు. దీంతో ఈ ఇద్దరిపై జీవిత కాల నిషేధం విధించారు.

Story first published: Thursday, July 30, 2020, 18:34 [IST]
Other articles published on Jul 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X