
ఇప్పటివరకు ఆసీస్ పేరిట
ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 263 పరుగులు చేసింది. ఇప్పుడు హజ్రతుల్లా జాజాయ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గన్‌కు ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇచ్చారు.

ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన హజ్రతుల్లా
ముఖ్యంగా హజ్రతుల్లా జజాయ్ (162 నాటౌట్; 62 బంతుల్లో 11 ఫోర్లు, 16 సిక్సులు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఘనీ(73; 48బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించాడు.

194 పరుగులకే పరిమితమైన ఐర్లాండ్
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కూడా ధాటిగానే ఛేదన ఆరంభించింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(91) దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కానీ అతనికి మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లేకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులకే పరిమితమైంది. దీంతో 84 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు:
* 42 సెంచరీకి హజ్రతుల్లా ఆడిన బంతులు. అంతర్జాతీయ టి20ల్లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ.
* 278 టి20ల్లో అత్యధిక జట్టు స్కోరు ఇది. 2016లో శ్రీలంకపై ఆస్ట్రేలియా (263/3) నెలకొల్పిన రికార్డు బద్దలైంది.
* 236 ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హజ్రతుల్లా, ఘని తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య 472 రన్స్ నమోదు కావడం మూడో అత్యధికం.
* 16 ఈ మ్యాచ్‌లో హజ్రతుల్లా కొట్టిన సిక్స్‌లు. వ్యక్తిగత టి20 ఇన్నింగ్స్‌లో ఇవే అత్యధికం. అంతేకాదు టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఎక్కువ సిక్సర్లు (21) నమోదు చేసిన జట్టుగా అఫ్ఘాన్ రికార్డు సృష్టించింది.


Click it and Unblock the Notifications












